వ్యక్తిగత గోప్యతకు పెద్దపీట వేస్తూ.. వాట్సాప్ ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా నెంబర్ల స్థానంలో యూజర్ నేమ్ పేరుతో మరో గట్టి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. వచ్చే జూలై నుంచి నవంబరు మధ్య దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు వాట్సాప్ తాజాగా ప్రకటించింది. తద్వారా.. వ్యక్తుల గోప్యతను మరింత జాగ్రత్తగా భద్ర పరిచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఏంటీ యూజర్ నేమ్!
ఎవరైనా కొత్తవారికి మనం వాట్సాప్‌లో మెసేజ్ చేయాలన్నా.. కాల్ చేయాలన్నా.. వారి నెంబరు మనకు, మన నెంబరు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు అన్ని లావాదేవీలు కూడా.. ఫోన్ నెంబరు తోనే ముడిపడి ఉంటున్నాయి. చివరకు బ్యాంకు ఖాతాలకు కూడా నెంబరే ముఖ్యం. దీంతో సైబర్ నేరస్థులు ఈ ఫోన్ నెంబర్ల ఆధారంగా దోపిడీని సునాయాసంగా చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో నెంబరు స్థానంలో యూజర్ నేమ్ అనే ఆప్షన్‌ను తీసుకువస్తున్నాయి.
అంటే.. మన ఫోన్ నెంబరుకు ఒక పేరును పెట్టుకుంటే.. ఇక, ఆ పేరుతోనే మనం ఎవరికైనా ఫోన్ చేయొచ్చు.. లేదా.. మెసేజ్ చేయొచ్చు. ఈ విధానంలో ఇకపై మన ఫోన్ నెంబరు ఎవరికీ కనిపించదు. మనం కావాలని ఇస్తే తప్ప.. ఫోన్ నెంబరును కూడా ఎవరూ తెలుసుకోలేరు. తద్వారా.. మోసాలకు అడ్డుకట్ట పడుతుందని వాట్సాప్ భావిస్తోంది. అలానే.. వ్యక్తిగత గోప్యతకు కూడా ఇది భద్రంగా ఉంటుంది. దీనిని
ఈ ఏడాది చివరి నాటికి పక్కాగా అమలు చేయనున్నారు.
ఎలా చేయాలి?
1) వాట్సాప్ సెట్టింగ్స్‌లో యూజర్ నేమ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
2) యూజర్ నేమ్ 3 నుంచి 35 అక్షరాలతో మనకు నచ్చిన పేరును ఎంచుకోవచ్చు.
3) యూజర్ నేమ్‌లో ఆంగ్ల అక్షరాలతోపాటు 0-9 వరకు అంకెలను కూడావాడుకోవచ్చు.
4) అంతేకాదు.. 4 అంకెలతో యూజర్ నేమ్ కీ కూడా సెట్ చేసుకోవచ్చు.
5) యూజర్ నేమ్ ఉంటే.. ఫోన్‌నెంబరు స్థానంలో దీనిని ఎవరికైనా షేర్ చేసి.. దాని నుంచే వాట్సాప్ సందేశాలు, ఫోన్లు చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మన ఫోన్ నెంబరు ఎవరికీ తెలియపరచాల్సిన అవసరం ఉండదు.
This post was last modified on June 30, 2026 5:49 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ…
ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నరేళ్ళ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధికార,…
అదేంటి రాముడు యుద్ధం చేయాల్సింది రావణుడితో కదా, మరి గాడ్జిల్లాతో ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం వేరే ఉంది. నవంబర్ 6…
ఆయా షేర్ అంటూ పాటల నుంచే సంచలనాలు మొదలుపెట్టిన ది ప్యారడైజ్ సినిమా దానికి తగ్గట్టే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్…
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఎన్నికలపై ప్రధాన పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కార్పొరేషన్ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…