వీడియో గేమ్స్ అంటే యువతకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు నచ్చిన గేమ్ కోసం గంటల తరబడి సమయం కేటాయించే అభిమానులు చాలామందే ఉంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు ఇష్టమైన గేమ్ ఆడేందుకు ఏకంగా భార్య, కుమార్తెకు డబ్బులు ఇచ్చి వారం రోజుల పాటు తనకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఒప్పందం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విచిత్రమైన వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
స్కాట్లాండ్‌కు చెందిన 38 ఏళ్ల సీన్ లిటిల్ అనే వ్యక్తి గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 గేమ్‌కు వీరాభిమాని. ఈ గేమ్ కోసం దాదాపు 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆయన, విడుదల సమయంలో పూర్తిగా గేమ్‌లోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఉద్యోగానికి వారం రోజుల సెలవు తీసుకోవడమే కాకుండా ఇంట్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అయితే సెలవుల్లో ఇంటి పనులు, ఇతర బాధ్యతలు తనకు అడ్డంకిగా మారకూడదని భావించాడు.
దీంతో తన భార్య నటాలీ, 13 ఏళ్ల కుమార్తె షార్లెట్‌తో కలిసి ఓ ప్రత్యేక ఒప్పందాన్ని సిద్ధం చేశాడు. ఈ ఒప్పందం ప్రకారం ఏడు రోజుల పాటు ఆయన గేమ్ ఆడుతున్నప్పుడు కుటుంబ సభ్యులు అంతరాయం కలిగించకూడదు. ఇంటి పనులు చేయమని అడగడం, ఎక్కువసేపు గేమ్ ఆడుతున్నాడని ప్రశ్నించడం, ఇతర పనుల కోసం పిలవడం వంటివి చేయకూడదని నిబంధనలు పెట్టాడు.
ఈ ఒప్పందంపై సంతకం చేసినందుకు భార్యకు 50 పౌండ్లు, కుమార్తెకు 20 పౌండ్లు చెల్లించాడు. అంతేకాకుండా ఇంటి ఖర్చుల కోసం వారానికి ఇచ్చే మొత్తాన్ని 500 పౌండ్లకు పెంచాడు. తన భార్యకు అదనంగా చిరుతిళ్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు కూడా ఇచ్చాడు. గేమ్ ఆడుతున్న సమయంలో వంట చేయడం, గిన్నెలు కడగడం వంటి పనులు చేయాల్సిన అవసరం రాకుండా ముందుగానే కాగితపు ప్లేట్లు కొనుగోలు చేశాడు.
ఈ విషయాన్ని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ సీన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తొలుత సామాజిక మాధ్యమాల్లో వీడియో కోసం సరదాగా ఈ ఒప్పందాన్ని తయారు చేశానని, కానీ ఇప్పుడు నిజంగానే అమలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ ప్రత్యేక సెలవుల కోసం ముందుగానే డబ్బు కూడబెట్టేందుకు వారాంతాల్లో కూడా పనిచేశాడు. రోజుకు 13 గంటల పాటు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపాడు.
మరోవైపు స్పెయిన్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు కూడా ఈ గేమ్ విడుదల సందర్భంగా విద్యార్థులకు ఇంటి పనులు, అసైన్‌మెంట్ల నుంచి విరామం ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, పరీక్ష తేదీని కూడా వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విడుదలకు ముందే ఈ గేమ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. గేమింగ్‌పై అభిమానం ఉంటే ఇలా కూడా సెలవులను ప్లాన్ చేసుకోవచ్చా అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.
This post was last modified on November 18, 2026 8:56 pm
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద మరో ఛార్జిషీట్ దాఖలైంది. జగన్ అక్రమాస్తుల కేసును…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…
టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…
కొన్ని కొన్ని ప్రకటనలు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయకులు మాత్రం ఊదరగొడుతూనే ఉంటారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత శబరిమల ఆలయాన్ని…
తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…
అన్ని విషయాల్లోనూ కాకపోయినా.. కొన్ని కొన్నివిషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చూపే చొరవ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజధాని…