Political News

వైసీపీని వెంటాడుతున్న అమ‌రావ‌తి.. సీరియ‌స్‌.. !

అమ‌రావ‌తి రాజ‌ధాని వ్య‌వ‌హారాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ లైట్ తీసుకుంటున్నారు. ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉంటార‌ని.. తాను ఏం చెప్పినా ఓకే అంటార‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ ఏడాది ఆయ‌న మూడు రాజ‌ధా నుల‌ను ప‌క్క‌న పెట్టి మావిగ‌న్ అనే మాట తెర‌మీదికి తెచ్చారు. దీనిపై అనేక మంది మేధావులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. కానీ, సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం త‌న‌తోనే ఉన్నార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

నిజానికి అమ‌రావ‌తి విష‌యంలో ప‌క్కా క్లారిటీతో ఉన్న పార్టీల జాబితాలో ఒక్క వైసీపీ నే మిన‌హాయింపుగా ఉంది. ఇత‌ర పార్టీలు అన్నీ కూడా అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కోరుకుంటున్నాయి. ప్ర‌జ‌లు కూడా అదే బాట ప‌డుతున్నారు. ఈ విష‌యం 2024లోనే స్ప‌ష్ట‌మైంది. పోనీ.. మూడు రాజ‌ధానులు అని పిలుపునిచ్చిన జ‌గ‌న్‌.. ఆ మాటకు కూడా క‌ట్టుబ‌డ‌లేక పోయారు. దానిని కూడా సాధించ‌లేక పోయారు.

ఫ‌లితంగా గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి తీవ్ర స్థాయిలో ఎదురు దెబ్బ‌త‌గిలింది. అయినా.. ఇప్ప‌టికీ అమ‌రావ‌తిని అంగీక‌రించే ప‌రిస్థితిలో వైసీపీ లేదు. తాజాగా చేప‌ట్టిన యాత్ర ద్వారా అమ‌రావ‌తికి అనుకూల‌మేన‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయిందా? అంటే అది కూడాలేదు. వారు ఎంచుకున్న‌ది అమ‌రావ‌తి కోసం కాదు.. రైతుల కోసం. అది కూడా రైతు ప‌రిర‌క్ష‌ణ యాత్ర పేరుతో నిర‌స‌న‌కు దిగారు. నిజానికి రైతుల విష‌యం ఎలా ఉన్నా.. రాజ‌ధాని విష‌యంలో క్లారిటీ లేక పోవ‌డ‌మే ఇప్పుడు వైసీపీని వేధిస్తోంది.

స్థానికంగా కూడా..
స్థానికంగా కూడా వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా రాజ‌ధాని రైతులు, భూములు, అప్పుల విష‌యంలో పెద్ద ఎత్తున ఉద్య‌మ‌మే చేసిన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి తాజాగా త‌ప్పుకున్నారు. అంద‌రూ ఒక‌టి అనుకున్న‌ప్పుడు.. తాను వ్య‌తిరేకించ‌న‌ని ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు అమ‌రావ‌తికి అనుకూల‌మనే ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. దీనిని ప‌రిష్క‌రించ‌కుండా.. త‌న స్టాండ్ ఏమిటో చెప్ప‌కుండా దోబూచులాడ‌డం జ‌గ‌న్‌కు మ‌రింత దెబ్బ‌తీస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

This post was last modified on June 30, 2026 8:21 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago