Trends

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ తేదీన లోహగఢ్ కోట దగ్గర కేతన్ అగర్వాల్ అనే పాతికేళ్ల యువకుడు ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని అందరూ భావించారు. తన పుట్టినరోజు వేడుకల కోసం కాబోయే భర్తతో కలిసి అక్కడికి వెళ్లానని, ఫొటోలు తీస్తుండగా కాలు జారి పడిపోయాడని అతని ప్రియురాలు సియా గోయల్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అనుమానం వచ్చిన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.

ఈ కేసును ఛేదించడంలో పోలీసులకు ఒక సీసీటీవీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారింది. సంఘటన జరిగిన రోజు ఉదయం ఉష్ణోగ్రత దాదాపు 33 డిగ్రీలు ఉంది. అంతటి ఎండలో కూడా కొండ కింది భాగంలో ఒక వ్యక్తి తలకు హుడీ వేసుకుని, చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతుండటం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఎండకు అలాంటి బట్టలు వేసుకోవడం పోలీసులకు అనుమానం తెప్పించింది. ఆ వ్యక్తిని చేతన్ చౌదరిగా గుర్తించి విచారించడంతో ఈ హత్య వెనుక ఉన్న చీకటి కోణం బయటపడింది.

పోలీసుల విచారణలో సియా, చేతన్ ఇద్దరూ గత ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తేలింది. అయితే కేతన్‌తో సియాకు గత ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం జరిగింది. నవంబర్ నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో దాదాపు పద్నాలుగు కోట్ల బడ్జెట్‌తో అత్యంత ఘనంగా పెళ్లి చేయడానికి పెద్దలు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ తన ప్రియుడిని వదులుకోవడం ఇష్టం లేని సియా, ఎలాగైనా కేతన్‌ను అడ్డుతొలగించుకోవాలని ఒక పక్కా ప్లాన్ వేసింది. అందుకోసమే పుట్టినరోజు పేరుతో అతన్ని ట్రెకింగ్‌కు తీసుకెళ్లింది.

ప్లాన్ ప్రకారం చేతన్ తన మొబైల్ ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి ఎవరికీ అనుమానం రాకుండా కోట దగ్గరికి చేరుకున్నాడు. కేతన్, సియా ఇద్దరూ జనం లేని ఒంటరి ప్రదేశానికి వెళ్లగానే.. అక్కడే నక్కి ఉన్న చేతన్ తో కలిసి ఆమె కాబోయే భర్తను కింద ఉన్న లోయలోకి తోసేసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొరికిపోకూడదనే ఉద్దేశంతోనే చేతన్ ఫోన్ తీసుకురాలేదని విచారణలో ఒప్పుకున్నాడు. ఎంతో అనుభవం ఉన్న ట్రెక్కర్ అయిన కేతన్ కాలుజారి పడిపోయాడనే వాదనను పోలీసులు మొదటి పరిగణనలోకి తీసుకోకపోవడమే ఈ కుట్రను బయటపెట్టింది.

ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే, కేతన్‌ను చంపడానికి ఇది రెండో ప్రయత్నం. సరిగ్గా నాలుగు రోజుల ముందు కూడా ఇదే కోట దగ్గర అతన్ని లోయలోకి తోసేయడానికి సియా ప్రయత్నించింది. కానీ అప్పట్లో పాము కనపడితే భయంతో పక్కకు నెట్టేశానని చెప్పి నమ్మించింది. ఆ మాటలు నిజమే అని నమ్మిన ఆ అమాయకుడు చివరికి ఆమె చేతిలోనే ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి, హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.

This post was last modified on June 24, 2026 7:49 pm

Share

Recent Posts

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

35 minutes ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

7 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

9 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

10 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

10 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

11 hours ago