Political News

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా మారింది. ఒక్క‌సారి గ్రీన్ కార్డు సాధిస్తే.. ఇక‌, తిరుగులేదు. గ్రీన్ కార్డు ద‌క్కించుకున్న ఇక‌, తాము అమెరికా పౌరుల‌మ‌ని.. త‌మ‌కు అన్ని చ‌ట్టాలు స‌మానంగానే వ‌ర్తిస్తాయ‌ని భావిస్తారు. ఇది సాధార‌ణంగా అంద‌రిలోనూ ఉండే భావ‌న‌. అయితే.. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు కొర‌డా ఝ‌ళిపించింది.

గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన‌.. ఏమైనా చేస్తామంటే కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. అది ఏదేశ పౌరుల‌కైనా వ‌ర్తిస్తుంద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. అమెరికా పౌరులు, ఇక్క‌డ‌ పుట్టిన వారికి, జ‌న్మ‌తో ద‌క్కే హ‌క్కులు గ్రీన్ కార్డు పౌరుల‌కు య‌థాత‌థంగా వ‌ర్తించ‌బోవ‌ని స్ప‌ష్టం చేసింది. వారు ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చి.. ఇక్క‌డ జీవించేందుకు.. మాత్ర‌మే గ్రీన్ కార్డు వ‌ర్తిస్తుంద‌ని.. ఇక్క‌డి హ‌క్కులు వారికి సంపూర్ణంగా వ‌ర్తించ‌వ‌ని స్ప‌ష్టం చేసింది.

అంతేకాదు.. గ్రీన్ కార్డు ఉంద‌ని.. నేరాలు, ఘోరాల‌కు పాల్ప‌డి.. ఇక్క‌డ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తామంటే కుద‌ర‌ద‌ని కూడా సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. గ్రీన్ కార్డు దారుడైన ఓ చైనా వ్య‌క్తి చేసిన నేరానికి సంబంధించిన విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది. గ్రీన్‌కార్డు అనేది.. కేవ‌లం నివాసానికి ప్ర‌భుత్వం ఇచ్చిన అనుమ‌తి మాత్ర‌మే. అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిని అడ్డు పెట్టుకుని నేరాలు చేయ‌డం, డ‌బ్బులు సంపాయించ‌డం వంటివి కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది.

ఇలా చేసిన వారిని వెంట‌నే.. దేశం నుంచి బ‌హిష్క‌రించ‌వ‌చ్చ‌ని సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఈ విష‌యంలో అధికారులకు సంపూర్ణ అధికారాలు ఉంటాయ‌ని పేర్కొంది. అయితే.. సంబంధిత గ్రీన్ కార్డు హోల్డ‌ర్ నేరం చేసిన‌ట్టు ప‌క్కా ఆధారాల‌ను సేక‌రించాల్సి ఉంటుంద‌ని హోం ల్యాండ్ సెక్యూరిటీకి సుప్రీంకోర్టు సూచించింది. నేరం చేసిన వారు ఎంత‌టి వారైనా.. విదేశీయులు అమెరికాలో ఉండేందుకు అర్హులు కార‌ని పేర్కొంది. సో.. గ్రీన్ కార్డు ఉంద‌ని గొప్ప‌ల‌కు పోతే.. దేశ‌బ‌హిష్క‌ర‌ణ త‌ప్ప‌ద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

This post was last modified on June 24, 2026 4:37 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago