మొబైల్ ఫోన్లు అందరి దగ్గరా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్ ఫోన్‌ను వినియోగిస్తున్నారని.. ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. అంతేకాదు.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ వాడకం పెరిగిందని కూడా ఈ సర్వే పేర్కొంది. అయితే.. ఎన్ని కంపెనీల మొబై ల్ ఫోన్లు ఉన్నా.. ఎన్ని ఫీచర్లు అందిస్తున్నా.. అందరినీ ఎంతో ముగ్ధులను చేసేవి.. ఐ-ఫోన్లు. ఈ ఐ-ఫోన్‌లో ఉండే భద్రతా ఫీచర్లు.. ఇతరకారణాలే దీనికి ఆ స్థాయిని తీసుకువచ్చాయి.
అంతేకాదు.. ఐఫోన్ అనేది.. వ్యక్తుల హుందాతనానికి, సమాజంలో గౌరవానికి కూడా చిహ్నంగా మారిపోయింది. దీంతో ఇటీవల కాలంలో ఐ-ఫోన్ వినియోగదారులు పెరిగాయి. విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఐ-ఫోన్-18 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్.. ప్రపంచ వ్యాప్తంగా మంచి షేర్ కూడా కలిగి ఉండడం గమనార్హం. కాగా.. తాజాగా ఈ కంపెనీ సీఈవో టిమ్ కుక్.. కీలక ప్రకటన చేశారు.
ముడి సరుకుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యానికి తోడు.. ఐఫోన్‌లో వినియోగించే అత్యంత భద్రతా పరమైన చిప్‌లకు కొరత ఏర్పడిందని తెలిపారు. దీంతో ఫోన్ల ధరలను పెంచే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ ధరలు సిరీస్ 18ను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన చూచాయగానే ఈ విషయం చెప్పినా.. ధరలు పెరగడం ఖాయమని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం మన దేశంలో ఐఫోన్-17 వెర్షన్ 150000 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఇక, అక్కడి నుంచి రూ.2 లక్షల వరకు కూడా పలుకుతున్నాయి. ఇక, 18 వెర్షన్.. కనిష్ఠ ధర 180000 రుపాయల నుంచి ప్రారంభమవుతుందని అంచనా. ఈ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే.. దీనికి మరోకారణం కూడా ఉంది. అమెరికా ప్రభుత్వం ఇటీవల ఐఫోన్లపై సుంకాలను భారీగా పెంచింది. అమెరికా బ్రాండ్‌విలువ పెంపులో భాగంగా సుంకాలను పెంచడంతో ఆ భారం కూడా.. 18 వెర్షన్‌పై పడనుందని అంటున్నారు.
This post was last modified on June 18, 2026 2:40 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…