Trends

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం… 8 మంది దుర్మరణం

ఏపీలో సోమావరం ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఈ భారీ ప్రమాదంలో ఏకంగా 8 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం కారణంగా స్టీల్ ప్లాంట్ లో అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఆ మంటలను చూసిన కార్మికులు, స్లీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు పెట్టారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదం ఏపీలో ఒక్కసారిగా భయాందోళనలను రేపింది. పెద్దగా ప్రమాదాలు లేకుండానే కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒక్కసారిగా 8 మందిని పొట్టనబెట్టుకున్న యాక్సిడెంట్ జరిగిన తీరును చూసి జనం భయానికి గురయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అవుతోందన్న భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జనం.. ఆ సంస్థలో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని తెలుసుకుని మనస్తాపానికి గురయ్యారని చెప్పక తప్పదు.

ఈ ప్రమాదానికి గల కారణాల విషయానికి వస్తే… విశాఖ స్లీల్ ప్లాంట్ లో ముడి ఖనిజం నుంచి ఉక్కును తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ద్రవ ఉక్కును పైకి ఎత్తుతున్న సమయంలో… ఓ భారీ బకెట్ నుంచి ఉక్కు ద్రవం లీకై కింద పడిపోయింది. అసలే వందల డిగ్రీల ఉష్టోగ్రతలతో ఉన్న ద్రవ ఉక్కు దేనిపై పడినా అది భస్మం కాక తప్పదు. ఈ ప్రమాదంలోనూ అదే జరిగింది. ఉక్కు ద్రవాన్ని పైకి ఎత్తిపోస్తున్న సమయంలో ఆ బెకెట్ లోని ద్రవం లీకైంది. ఆ ద్రవ ఉక్కు పడిన కారణంగా అక్కడ ఉన్న బారీ క్రేన్ అక్కడికక్కడే బుగ్గి అయ్యిందట.

ఈ ప్రమాదంలో ఉక్కు ద్రవం పడిన ప్రాంతమంతా అదిక వేడితో నిండిపోయింది. ఈ సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్మికులు మృత్యువాత పడినట్లు సమాచారం. అసలు ఉక్కు ద్రవాన్ని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి ఉక్కు ద్రవం మనిషి మీడ పడితే మాడిపోక తప్పదు. భారీ క్రేన్ నే దహించి వేసిన ఉక్కు ద్రవం 8 మంది కార్మికులను కూడా పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన ఉక్కు ద్రవం లీక్ కావడానికి గల కారణాలేమిటన్న విషయం తేలాల్సి ఉంది.

This post was last modified on June 8, 2026 6:48 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago