బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక స్థిరత్వం తెచ్చుకుని, తర్వాత భాగస్వామికి టాటా చెప్పేస్తుంటారు. ఇలాంటి వాళ్లను గోల్డ్ డిగ్గర్స్ అంటుంటారు.
సుస్మితా సేన్ కూడా ఈ కోవకు చెందిందే అంటూ ఆమె మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ మాజీ విశ్వసుందరికి 50 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. గతంలో బాలీవుడ్లో కొన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్న సుస్మిత.. తర్వాత సింగిల్‌గానే కొనసాగింది.
ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేస్తున్న సుస్మిత.. కొన్నేళ్ల ముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో ప్రేమలో పడింది. లేటు వయసులో వీళ్లిద్దరూ డేటింగ్ చేయడం మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న టైంలో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కేసులు ఎదుర్కొని లండన్‌కు వెళ్లిపోయిన మోడీ.. కేసుల భయంతో అక్కడే సెటిలైపోయాడు. తిరిగి ఇండియాకు రాలేదు.
సుస్మిత లండన్‌కే వెళ్లి కొన్నేళ్లు లలిత్‌తో ఉండి, ఈ మధ్య ఆయనకు టాటా చెప్పేసి వచ్చేసింది. ఐతే లలిత్ దగ్గర డబ్బులు దండుకుని ఇండియాకు వచ్చేసిందంటూ ఆమెపై ‘గోల్డ్ డిగ్గర్’ అని ముద్ర వేసి విమర్శలు చేస్తున్నారు.
దీనిపై లలిత్ మోడీ తాజాగా స్పందించాడు. సుస్మితపై విమర్శలు అర్థరహితమని, ఆమె తన దగ్గర్నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశాడు.
‘‘సుస్మిత నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి, ఎదగడానికి ఆమె ఎంతో సాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం. సుస్మిత కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గర ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. ఆమె వాటన్నంటినీ తన కష్టంతో సంపాదించుకుంది.
సుస్మితకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. మేం కలిసి ఉన్న సమయంలో బయటికి వెళ్తే నేను దేనికీ డబ్బులు చెల్లించేవాడిని కాదు. ఆమెనే అన్నింటికీ డబ్బులు కట్టేది. నేనే ఆమె డబ్బుల మీద ఆధారపడ్డాను తప్ప.. నా డబ్బు ఆమె తీసుకోలేదు. ఎవరి దగ్గరా ఏదీ ఆశించడానికి ఆమె ఇష్టపడదు. తన గురించి తెలియన వాళ్లు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారు’’ అంటూ సుస్మితకు సర్టిఫికెట్ ఇచ్చాడు లలిత్ మోడీ.
This post was last modified on June 2, 2026 2:42 pm
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…