యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే ఉన్న ఆమె మొన్న విడుదలైన ‘రాకస’ సినిమా నిర్మాతగా ఆమెకు మంచి విజయం అందుకున్నారు. కమర్షియల్‌గా నిలబడటమే కాదు, కంటెంట్‌తో కూడా మెప్పించింది. తెర వెనుక బిజీగా ఉంటూనే, తెర ముందు తన గ్లామర్‌ని మాత్రం తగ్గనివ్వడం లేదు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హడావుడిలోంచి ‘పది నిమిషాలు దొంగిలించాను’ అని క్యాప్షన్ పెట్టి కొన్ని పిక్స్ పోస్ట్ చేశారు. అందమైన గౌన్‌లో, చెవులకు వైట్ స్టోన్ డ్రాప్స్, చేతికి బోల్డ్ బ్రేస్‌లెట్‌తో చాలా కొత్తగా కనిపించింది. మేకప్ మరీ ఎక్కువ లేకుండా, జుట్టు వదిలేసి సింపుల్‌గా ఉన్నా లుక్ మొత్తం క్లాస్‌గా ఉంది. ఫ్రెంచ్ రివేరా రోడ్డు మీద గాలికి ఎగురుతున్న డ్రెస్‌తో తీసిన ఫొటో అయితే ఇన్‌స్టా టైమ్‌లైన్‌ని లైట్ చేసేసింది.
నిహారిక జర్నీ చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. యాంకర్‌గా ఢీ షోతో గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ఒక మనసు, సూర్యకాంతం చేశారు. వెబ్ సిరీస్ మాడ్ హౌస్ తో డిజిటల్‌లోకి వచ్చినా.. అవి ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ఆగలేదు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పెట్టి ‘కమిటీ కుర్రోళ్లు’ తీశారు. ఇటీవల ‘రాకస’తో నిర్మాతగా మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు. అంటే కెమెరా ముందు నుంచి వెనుకకు వెళ్లినా, తన క్రియేటివిటీని వేరే రూపంలో చూపిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాత్రలు మారినా తన బ్రాండ్ మారలేదు. నిర్మాతగా సీరియస్‌గా ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూనే, సోషల్ మీడియాలో గ్లామర్ గర్ల్‌గా కనిపించడానికి వెనుకాడటం లేదు. చాలామంది కెరీర్ మార్చుకున్నప్పుడు ఇమేజ్ మార్చేస్తారు. కానీ నిహారిక తన స్టైల్‌ని, ఫ్యాషన్‌ని పక్కన పెట్టలేదు. కేన్స్ లాంటి వేదిక మీద ఇలా దర్శనమివ్వడం అంటే తను ఇంకా లైమ్‌లైట్‌లో ఉండటానికి ఇష్టపడుతోందని అర్ధమవుతుంది. ఏదేమైనా నిహారిక ఒక మల్టీ టాస్కర్ అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది. తెరమీద కనిపించకపోయినా తెర వెనుక గేమ్ నడుపుతోంది. సినిమా తీయడం, బిజినెస్ చూసుకోవడం అన్నీ చేస్తూనే, తనకంటూ ఒక స్టైల్ స్టేట్‌మెంట్ మెయింటైన్ చేస్తోంది.
This post was last modified on May 19, 2026 9:32 pm
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…