Movie News

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త సినిమా రేంజ్ లో హడావిడి చేయించి ఇపుడున్న రెగ్యులర్ టికెట్ రేట్లతోనే వాళ్ళ భావోద్వేగాలతో వ్యాపారం చేయడం అనేది మాములు విషయంగా మారిపోయింది. ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుంది కానీ అదే పనిగా క్యూ కట్టి వదులుతుంటే ఎవరైనా ఏం చేస్తారు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ తతంగాన్ని లైట్ తీసుకున్నారు.

రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా ఊసరవెల్లి, ఆంధ్రావాలా రెండూ రీ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒకటే ఫ్లాప్ కాగా రెండోది డిజాస్టర్. అయినా సరే ఏదోలా జనాన్ని రప్పిద్దామనే ఉద్దేశంతో ప్రచారం బాగానే చేశారు. కట్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఊసరవెల్లికి మెయిన్ సెంటర్స్ మార్నింగ్ షోలకు ఓ మోస్తరు అమ్మకాలు జరుగుతుండగా ఆంధ్రావాలాని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చని దారుణమైన మూవీ ఇది.

వాళ్ళ ధ్యాస మొత్తం ఎన్టీఆర్ నీల్ టీజర్ మీదే ఉంది. నాలుగు నిమిషాల వీడియోలో ఎంత విధ్వంసం చూపిస్తారోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే ఊసరవెళ్లి మీద ఇంకొంచెం బెటర్ అటెన్షన్ వచ్చేదేమో కానీ కొత్త కంటెంట్ వస్తున్నప్పుడు పాతవి పట్టించుకోవడం కష్టమే. రేపు మొత్తం డ్రాగన్ తాలూకు హడావిడిలో సోషల్ మీడియా ఊగిపోయేలా ఉంది. క్లిక్ అయ్యిందా రోజు మొత్తం వాటి విజువల్స్ తో హోరెత్తిస్తారు.

డ్రాగన్ విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి అభిమానులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదు. అన్నీ అనుకున్న టైంలో జరిగి ఉంటే ఈ జూన్ కే రిలీజ్ అయ్యేది. టోవినో థామస్ తప్పుకోవడం, ఫారిన్ షెడ్యూల్స్ కొన్ని అనుకున్నట్టుగా జరగకపోవడం, అంతర్జాతీయ పరిస్థితులు లాంటి కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఇవాళ వచ్చే టీజర్ సంవత్సరానికి సరిపడా ఎనర్జీ ఇవ్వాలి. ప్రశాంత్ నీల్ అంత ఏం వండాడో చూడాలి.

This post was last modified on May 19, 2026 6:10 pm

Share

Recent Posts

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

1 hour ago

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

2 hours ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

2 hours ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

2 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

2 hours ago

మగాళ్లకు పీరియడ్స్ రావాలని వెయ్యిసార్లు ప్రార్థించిన నటి

మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…

4 hours ago