Political News

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… నాడు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె హోదాతో పాటుగా సిట్టింగ్ ఎంపీగా బరిలోకి దిగిన కల్వకుంట్ల కవితను ఓడించిన నేతగా అరవింద్ కు మంచి మైలేజీ ఉందని చెప్పాలి. నిజామాబాద్ ఎంపీగా వరుసగా రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన అరవింద్… ఎందుకనో గానీ ఇటీవల ఒకింత కంట్రోల్ తప్పినట్లుగా కనిపిస్తున్నారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్న అరవింద్ అసలు తన ఉద్దేశ్యం ఏమిటన్న విషయాన్ని తెలియనీయకుండా సాగుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.

మీడియాతో మాట్లాడిన సందర్భంగా బీజేపీ నేతలపై అరవింద్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఉత్తుత్తి నిరసనలు చేస్తున్న కొందరు బీజేపీ నేతలు… కావాలని పోలీసులను పిలిపించుకుని మరీ అరెస్టు అవుతున్నారని ఆయన సెటైర్లు సంధించారు. ఇలా పోలీసులను పిలిపించుకుని అరెస్టు అయిన వారిలో బీజేపీ ఆఫీస్ బేరర్లు కూడా ఉన్నారన్న అరవింద్… ఈ తరహా ఘటనలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పద్ధతి మార్చుకోకపోతే… బీజేపీలో పదవులు ఊడిపోతాయని ఆయన హెచ్చరించిన వైనం నిజంగానే అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

రెండు రోజుల క్రితం ఇలానే మీడియా ముందుకు వచ్చిన అరవింద్… ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ ఓ బాంబు లాంటి వార్తను పేల్చారు. సీఎం వరుసబెట్టి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మోదీతో రేవంత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని, ఈ వ్యవహారంపై దృష్టి సారించి కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతటితో ఆగని అరవింద్.. రేవంత్ ను సీఎం కుర్చీ నుంచి దించేసి ఆ స్థానంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలను కూర్చోబెట్టాలని కూడా ఆయన కాంగ్రెస్ కు సలహా ఇచ్చారు.

ఈ తరహా గందరగోళం సృష్టించే వ్యాఖ్యలు అరవింద్ నోట నుంచి గతంలో ఎన్నడూ వెలువడలేదనే చెప్పాలి. బీజేపీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్న అరవింద్ రెండు పర్యాయాలు…అది కూడా వెంటవెంటనే ఎంపీగా గెలిచిన తీరు నిజంగానే అరుదనే చెప్పాలి, అరవింద్ ఓడించింది సాదాసీదా వ్యక్తిని కూడా కాదు.

ఏకంగా ఓ సీఎం కూతురిని ఓడించిన ఆయన సత్తాను చూస్తే… బలమైన రాజకీయ వేత్తను చూసినట్టే ఉంటుంది. అలాంటిది సొంత పార్టీ నేతలతో ఏదైనా మనస్పర్థలు ఉన్నా వాటిని నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి గానీ… ఇలా బహిరంగంగా సొంత పార్టీ నేతలను తూలనాడటం విడ్డూరమనే చెప్పాలి. ఈ వ్యాఖ్యల ద్వారా మొత్తంగా పార్టీ తీరునే ప్రశ్నించినట్టు అవుతుందన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి.

This post was last modified on May 19, 2026 6:19 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

51 minutes ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

2 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

7 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

8 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

11 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

11 hours ago