Political News

ఆ రోజు విజ‌య్ ఏమ‌న్నాడో తెలుసా?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ బాగానే ప్ర‌భావం చూపిస్తాడ‌ని చాలామంది అన్నారు కానీ.. మ‌రీ అధికారం చేప‌ట్టే స్థాయిలో త‌న ప్ర‌భావం ఉంటుంద‌ని ఊహించిన వాళ్లు త‌క్కువ‌. ఆయ‌న విజ‌యానికి క‌లిసి వ‌చ్చిన కార‌ణాల గురించి ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించ‌డం మొద‌లుపెట్టారు. ఐతే విజ‌య్ మాత్రం ముందు నుంచి తన పార్టీ అధికారంలోకి రాగ‌ల‌ద‌ని బ‌లంగా న‌మ్మాడు.

గ‌త ఏడాది క‌రూర్ విషాదాంతం త‌ర్వాత కొంత కాలం రాజ‌కీయ స‌భ‌లేవీ పెట్ట‌కుండా సైలెంట్ అయిపోయిన విజ‌య్.. ఆ త‌ర్వాత ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆ ఘ‌ట‌న గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌ను అప్పుడు ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టంచుకోక‌పోయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు ఆ వ్యాఖ్య‌ల తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

డీఎంకే పార్టీకే కాక‌ స్టాలిన్‌కూ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌థ్య‌మ‌ని చెప్పిన విజ‌యం.. అప్పుడు త‌నతో పెట్టుకున్నందుకు చింతిస్తాడంటూ విజ‌య్ వ్యాఖ్యానించ‌డం విశేషం. ఇంత‌కీ ఆ రోజు విజ‌య్ ఏమ‌న్నాడంటే..?

స్టాలిన్ సార్.. ఈ ఎన్నిక‌ల‌కు అనంత‌రం.. మీరు ఓడిపోయిన త‌ర్వాత మీరు ఎలా ఫీల‌వుతారో ఈ రోజు కొంచెం చెప్ప‌నా? ఎందుకురా ఈ విజ‌య్‌ని ఇబ్బంది పెట్టాం? ఎందుకురా ఈ విజ‌య్‌ని వేధించాం? ఎందుకురా ఈ విజ‌య్‌కు వ్య‌తిరేకంగా కుట్ర చేశాం? ఇలా తలుచుకుని త‌లుచుకుని బాధ ప‌డ‌తారు. ప్ర‌జ‌లే మీరు అలా ఫీల‌య్యేలా చేస్తారు చూడండి.

నేను మీకు అంత చెడు ఏం చేశాను? మీరు తినే తిండిలో ఏమైనా మ‌న్ను వేశానా? మీ పార్టీ తీరును.. మీరు, మీ మంత్రులు చేసే దోపిడీని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశాను? ఇది చెప్ప‌కుండా ఇంకేం చెబుతారు? క‌రూర్ విష‌యానికి వ‌స్తాను. అక్క‌డ ఏం జ‌రిగింద‌ని ఆ ప్రాంత జ‌నాల‌ను అడిగితే జ‌రిగింది జ‌రిగిన‌ట్లు చెబుతారు. కానీ నింద నా మీద వేశారు.

మేం ఇలాంటి విష‌యాల్లో రాజ‌కీయ‌మే చేయ‌ను అని మీడియాకు స్టేట్మెంట్ ఇచ్చి, అసెంబ్లీకి వెళ్లి నా మీదికి త‌ప్పును తోసేశారు. నేను ఆల‌స్యంగా రావ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌న్నారు. కానీ నేను పోలీసులు చెప్పిన టైంకే అక్క‌డికి వ‌చ్చాను.

కానీ క‌రూర్‌కు రావ‌డానికి ముందు దారి పొడ‌వునా జ‌నం ఉంటే వారిని ప‌ల‌క‌రించ‌కుండా ఎలా అక్క‌డికి రాగ‌ల‌ను. ఆ రోజు నేను క‌రూర్‌కు ఎలా వ‌చ్చాను, అక్క‌డ ఏం జ‌రిగింది అన్న‌ది ప్ర‌పంచ‌మే లైవ్‌లో చూసింది. అయినా నింద నా మీదికి తోసేయాల‌ని చూశారు. దీనికి ఫ‌లితం అనుభ‌విస్తారు అని విజ‌య్ పేర్కొన్నాడు.

This post was last modified on May 5, 2026 10:28 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

5 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

5 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

6 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

6 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

8 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

9 hours ago