ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. అప్పటికే ప్రేమతో మీ కార్తీక్ అనే ఒక సినిమా చేసినా.. దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు అవకాశాలు వెల్లువెత్తాయి. వరుసబెట్టి సినిమాలు చేశాడు కానీ.. మళ్లీ ఆర్ఎక్స్ 100 రేంజ్ సక్సెస్ ఒక్కటీ పడలేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో చేసిన చావు కబురు చల్లగా సైతం అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది.
నేచురల్ స్టార్ నాని సినిమా గ్యాంగ్ లీడర్‌లో, తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ మూవీలో విలన్ పాత్రలు చేస్తే ఆ సినిమాలు కూడా సరిగా ఆడలేదు. ఐతే ఇలా వరుసగా ఫెయిల్యూర్లు వస్తున్నా ఆపకుండా సినిమాలు చేసిన కార్తికేయ.. వరుసగా రెండు హిట్లు కొట్టాక అదృశ్యం అయిపోవడమే ఆశ్చర్యం. 2023లో అతను నటించిన ఫాంటసీ కామెడీ ఫిలిం బెదురులంక 2012 బాగానే ఆడింది. ఆ తర్వాత కార్తికేయ భజే వాయు వేగం అనే యాక్షణ్ థ్రిల్లర్‌లో నటించాడు. అది కూడా బాగా ఆడింది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ ప్రొడ్యూస్ చేసింది.
ఇలా వరుసగా రెండు విజయాలు అందుకున్న హీరో ఫుల్ బిజీ అయిపోతాడు. కానీ కార్తికేయ మాత్రం భజే వాయు వేగం రిలీజై రెండేళ్లు గడుస్తున్నా కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. పోనీ వలిమై తర్వాత తమిళంలో ఏమైనా బిజీ అయిపోయాడా అంటే అదేమీ లేదు. అక్కడ కూడా సినిమాలేవీ చేయట్లేదు. తెలుగులో అతను ఎవరైనా దర్వకుడు, నిర్మాతతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు రావట్లేదు. రెండేళ్లలో ఎక్కడా కార్తికేయ గురించి ఏ న్యూస్ లేదు. సోషల్ మీడియాలో కూడా సౌండ్ చేయట్లేదు కార్తికేయ.
ఇలా ఒక నటుడి కెరీర్లో గ్యాప్ వస్తే ప్రేక్షకులు నెమ్మదిగా మరిచిపోతారు. కార్తికేయ విషయంలో అదే జరుగుతోంది. ఇండస్ట్రీ జనాల చర్చల్లో అతడి పేరు వినిపించట్లేదు. ఈ సినిమా ఈవెంట్లోనూ కార్తికేయ కనిపించడం లేదు. మరి అతడికి ఏమైంది? ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నాడు.. ఏదైనా స్పెషల్ ప్రాజెక్టు మీద సైలెంటుగా ఏమైనా పని చేస్తున్నాడా అన్నది తెలియడం లేదు. మరి కార్తికేయ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
This post was last modified on May 4, 2026 12:35 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్‌లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…