పెళ్లయిన హీరోయిన్లు రొమాంటిక్, ఇంటిమేట్ సీన్లు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కొన్ని కండిషన్ల మేరకే వాళ్లు తమ పాత్రలకు ఓకే చెబుతారు. కానీ ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్లలో కొందరు పెళ్లి తర్వాత కూడా బోల్డ్ క్యారెక్టర్లు చేస్తున్నారు. దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ లాంటి వాళ్లు అందుకు ఉదాహరణ.
పఠాన్‌లో దీపిక, దేదే ప్యార్ దే-2లో రకుల్, వార్-2లో కియారా ఎంత హాట్ హాట్‌గా కనిపించారో తెలిసిందే. ఐతే ఇప్పుడు కియారా తీరు మారిపోయిందని.. తాను కథానాయికగా నటించిన సౌత్ మూవీ టాక్సిక్‌లో ఆమె ఇంటిమేట్ సీన్ల డోస్ తగ్గించాలని టీంను డిమాండ్ చేసిందని అంటూ కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఐతే ఈ వార్తల మీద కొంచెం ఆలస్యంగా అయినా కియారా స్పందించింది. ఈ వార్తల తాలూకు క్లిప్పింగ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఇది పూర్తిగా అర్తరహితం (Absolute nonsense) అని పేర్కొంది కియారా. దీంతో కియారా గురించి మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం అంతా అబద్ధం అని తేలిపోయింది. అయినా బాలీవుడ్ సినిమాల్లో అంత ఎక్స్‌పోజింగ్ చేయడానికి లేని ఇబ్బంది.. సౌత్ మూవీ విషయంలో ఎందుకుంటుందన్నది సందేహం.
వార్-2లో ఆమె బికినీ లుక్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇటీవల ఒక ఈవెంట్లోనూ చాలా హాట్‌గా కనిపించింది కియారా. టాక్సిక్ సినిమాలో కియారాతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి కూడా కీలక పాత్రలు పోషించారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న టాక్సిక్‌లో ఫస్ట్ పార్ట్‌ను జూన్ 4న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో పరిస్థితులు పూర్తిగా చక్కబడకపోవడంతో టాక్సిక్ విడుదలకు మరింత సమయం తీసుకోవాలని టీం భావించింది. అందుకే రెండోసారి సినిమాను వాయిదా వేశారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఈ మూవీ విడుదల కావచ్చని భావిస్తున్నారు.
This post was last modified on May 5, 2026 10:25 am
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…