రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త కార్యక్రమాలకు వేదికగా మారుతోంది. ఇటీవల కాలంలో అలాంటి కార్యక్రమాల జోరు పెరుగుతోంది. దెయ్యాలు.. ఆత్మలు.. ఉన్నాయని నమ్మేవారు.. సందేహాలు వ్యక్తం చేసేవారు.. వాటి ఉనికి గురించి ఆలోచనలు చేసే వారు.. తమకున్న అనుభవాల గురించి మాట్లాడుకోవటం.. షేర్ చేసుకోవటం లాంటి అంశాల కాన్సెప్టు తో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం.. ‘పారా నార్మల్ టాక్స్’.
ఈ అంశాల మీద ఆసక్తి ఉన్న వారు ఒకచోటకు చేరి ఆలోచించేలా.. నిజమైన అనుభవాలను చర్చిస్తుననారు.
దీనికి ‘థాట్ ప్రోవోకింగ్ నైట్’ పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ట్రెండ్ అవుతోంది. నిజానికి ఈ సరికొత్త ట్రెండ్ కు ముంబయి.. ఢిల్లీ.. బెంగళూరు మహానగరాల్లో బీజం పడగా.. ఇప్పుడా ట్రెండ్ హైదరాబాద్ కు వచ్చేసింది. ఇప్పటికే ఈ తరహా ఈవెంట్లు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. ఈ తరహా థీమ్ తో తమ మొదటి కార్యక్రమాన్ని ఈ జనవరిలో నిర్వహించినట్లుగా చెబుతున్నారు.
ఈ తరహా ఈవెంట్ ను వీకెండ్ లోనే నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్.. మాదాపూర్.. హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. పారా నార్మల్ థీమ్ తో ఏర్పాటు చేస్తున్న ఈ వేదికల్లో పద్దెనిమిదేళ్లకు పైబడిన వారు మాత్రమే పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం నిర్వాహకులు పక్కాగా ఉంటున్నారు.
ఈ కార్యక్రమాన్ని తెలుగు.. ఇంగ్లిషు.. హిందీలలో మాట్లాడేవారికి అనువుగా నిర్వహిస్తున్నారు. అలా అని దెయ్యాలు.. ప్రేతాలు.. ఆత్మలు లాంటి అంశాలపై భయం కలిగేలా కాకుండా.. ఆలోచనాత్మకంగా ఉండే కథల్ని షేర్ చేసుకునేలా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గంట పాటు నిర్వహించే ఈ ప్రోగ్రాంను పరిస్థితులు.. వేదికకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉంటున్నాయి.
కొన్నిసార్లు ఇండోర్.. మరికొన్నిసార్లు సీటెడ్.. స్టాండింగ్ ఇలాంటి ఎంపికలతో వేదికల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాల్గొనే వారుతమ నిజజీవితంలో తమకు ఎదురైన అనుభవాలను.. కథలను మిగిలిన వారితో షేర్ చేసుకుంటారు. ఈ థీమ్ కు ఇటీవల ఆదరణ పెరుగుతుందని చెబుతున్నారు. ఎవరికి తగ్గట్లు వారు.. ఎవరి ఐడియాలజీలకు సూట్ అయ్యే ప్రోగ్రాంలు వారు నిర్వహించుకునేలా ఉండటం గమనార్హం.
This post was last modified on April 1, 2026 10:06 am
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…