Movie News

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం విశేషం. 19 ఏళ్ల వయసులోనే ‘దేవి’ సినిమాతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలైంది. ఇంకొన్నేళ్లకే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. ఆ తర్వాత నంబర్ వన్ స్థానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

మణిశర్మ జోరు తగ్గాక చాలా ఏళ్ల పాటు అతనే తెలుగులో పెద్ద సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉన్నాడు. ఐతే గత కొన్నేళ్లలో తమన్, అనిరుధ్ రవిచందర్ విజృంభించడంతో అతడి దూకుడు తగ్గింది. సినిమాలు తగ్గాయి. తన సంగీతంలో క్వాలిటీ కూడా తగ్గిందనే విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో ‘యల్లమ్మ’ చిత్రంతో హీరో అవతారం ఎత్తుతుండడంతో సంగీతం మీద దేవిశ్రీ ఫోకస్ తగ్గిపోయిందని.. ఇక తన పనైపోయిందనే కామెంట్లు వినిపించాయి. కానీ దేవి చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ విజృంభించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

నిన్న దేవి పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన అనౌన్స్‌మెంట్లు తన అభిమానుల్లో అంచనాలను పెంచాయి. ‘యల్లమ్మ’ నుంచి పార్శి పాత్రలో దేవిని పరిచయం చేయగా.. ఈ చిన్న గ్లింప్స్‌లో సంగీత పరంగా తన మార్కు చూపించాడతను. ఇంటెన్స్‌గా, కొత్తగా అనిపించే సౌండింగ్‌తో ‘యల్లమ్మ’ మ్యూజిక్‌పై అంచనాలు పెంచాడు దేవి. మరోవైపు అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయి అయిన వందో సినిమాకు కూడా దేవినే సంగీత దర్శకుడిగా ప్రకటించారు. నాగ్‌తో దేవికిది ఐదో సినిమా కావడం విశేషం.

వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే కావడం, నాగ్‌కిది ప్రెస్టీజియస్ మూవీ కావడంతో దేవి తన సంగీతంతో ఉర్రూతలూగిస్తాడనడంలో సందేహం లేదు. మరోవైపు కార్తి కెరీర్లో 30వ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవినే ప్రకటించారు. మొత్తంగా దేవి పనిచేయనున్న సినిమాలన్నీ అమితాసక్తి రేకెత్తిస్తున్నవే. ఇక సుకుమార్, రామ్ చరణ్ కలయికలో రాబోతున్న కొత్త సినిమాకు దేవి పని చేస్తాడా లేదా అన్నదే తేలాల్సి ఉంది. తొలిసారిగా దేవి లేకుండా వేరే సంగీత దర్శకుడితో సుక్కు పూర్తి స్థాయిలో ఒక సినిమాకు పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

This post was last modified on August 3, 2026 8:24 pm

Share

Recent Posts

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…

20 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

39 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

1 hour ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago