Political News

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయనను బీజేపీ ఏమాత్రం లెక్క చేయలేదు. బీజేపీకి కంచుకోటగా పేరున్న బంకీపూర్ లో మేము కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తాయి అని కమలం నాయకులు ప్రగల్భాలు పలికారు. దాంతో బంకీ పూర్ ప్రజలకు ఎక్కడో కాలినట్టుంది. గంపగుత్తుగా ప్రశాంత్ కిషోర్ కు ఓట్లేసి గెలిపించారు.

సోమవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండు లోనూ ప్రశాంత్ కిషోర్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏ ఒక్క రౌండ్ లోనూ బీజేపీ తన ఉనికి చాటుకోలేక పోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సొంత నియోజకవర్గంలో చెజేతులా పరువు
పోగొట్టుకుంది.

ఇది బీజేపీకి కంచుకోట. నితిన్ నబిన్ ఇక్కడ నుంచి వరసగా ఐదు సార్లు గెలిచారు. ఇటీవల బీజేపీ జాతీయ పగ్గాలు చేపట్టడంతో అయన రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో బంకీ పూర్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ యువ నాయకుడు నీరజ్ కుమార్ సిన్హా పోటీకి నిలబడ్డారు. ఊహించని రీతిలో ప్రశాంత్ కిషోర్ పోటీకి దిగి బీజేపీకి షాక్ ఇచ్చారు.

ఎన్నికల వ్యూహకర్తగా బ్రాండ్ ఇమేజ్ సాధించిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ చిత్తుగా ఓటమి చెందాడు. దాంతో ఆయనకున్న ఇమేజ్ కూడా పోయింది. పట్టు విడవకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడంతో బీహార్ లో రాజకీయ పరిణామాలు మారే సూచనలు కానవస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, ఆర్జేడీలతో విసుగెత్తిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జన్ సురాజ్ వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు.

This post was last modified on August 3, 2026 6:15 pm

Share

Recent Posts

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

36 minutes ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

45 minutes ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

45 minutes ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

3 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

4 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

4 hours ago