Movie News

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సినిమా 7 గంటల 30 నిమిషాల నిడివితో విడుదల కానుంది. దురంధర్, దురంధర్ ది రివెంజ్ రెండు భాగాలు కలిపి సింగిల్ వెర్షన్ లో ఏప్రిల్ 5 ఎంపిక చేసిన ప్రీమియం స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. అయితే ఇవి లిమిటెడ్ షోలు. చాలా పరిమితంగా వేయబోతున్నారు. టికెట్ల అమ్మకం ఇవాళో రేపో జరగనుంది.

మాములుగా ఇంట్లోనే కుదురుగా ఇంత నిడివి వెబ్ సిరీస్ చూడటమే కష్టం. అలాంటిది ఒక మూవీ ఎక్స్ పీరియన్స్ చేయడం ఒకరకంగా కొత్త ఎక్స్ పీరియన్స్. మూవీ లవర్స్ దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షో టైంని బట్టి మధ్యాన్నం భోజనమో లేదా రాత్రి ఆహారమో థియేటర్లోనే తినాల్సి ఉంటుంది. కనీసం మూడు ఇంటర్వెల్స్ తప్పవని బయ్యర్లు చెబుతున్నారు. హాంగ్ కాంగ్ లో కూడా ఈ ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. సక్సెస్ అయితే ఇండియా వైడ్ అమలు చేస్తారు.

ఎలా చూసినా ఇంత సేపు థియేటర్లో గడపాలంటే చేస్తున్న ఉద్యోగానికి, వ్యాపారానికి ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సిందే తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ప్రస్తుతం సమయం డిసైడ్ చేసే పని మీద మల్టీప్లెక్సులు ఉన్నాయి. మరి టికెట్ రేట్ ఎప్పుడు ఉండేదా పెడతారా లేక అదనంగా ఏమైనా ఛార్జ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎలాగూ ఐమాక్స్ లాంటి స్పెషల్ స్క్రీన్లలోనే ప్రదర్శిస్తారు కనక వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు ఒక్కో టికెట్ ఉంటుంది.

బాహుబలితో సింగల్ పార్ట్ కాన్సెప్ట్ పరిచయం చేసిన రాజమౌళి దారిలోనే ఆదిత్య దార్ ప్రయాణిస్తున్నాడు. ఇప్పటిదాకా ఏ భాషలోనూ ఇంత నిడివితో మూవీ రాలేదు. దురంధర్ పేరు మీద ఆ రికార్డు శాశ్వతంగా ఉండిపోతుంది. భవిష్యత్తులో ఎవరైనా ట్రై చేసినా సక్సెస్ అయినా మొదట ఈ ఘనత సాధించిన దర్శకుడిగా ఆదిత్య స్పెషల్ గా ఉండిపోతారు. అన్నట్టు ఈ కొత్త వెర్షన్ లో సౌండ్ మిక్సింగ్ మార్పులతో పాటు పాటలను బిజిఎంలోకి సింక్ చేయడం లాంటి మార్పులు చేశారట. సెన్సార్ కూడా ఫ్రెష్ గా జరిగింది.

This post was last modified on April 1, 2026 11:08 am

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

2 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

3 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

3 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

4 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

6 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

7 hours ago