Movie News

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం దాకా ఒకటే మోత. ఎన్నడూ లేనిది ఒక హాలీవుడ్ మూవీకి ఈ స్థాయిలో ఎగబడటం చూసి థియేటర్ ఓనర్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదో ప్రభాస్ మూవీ రిలీజయ్యిందానే రేంజ్ లో టికెట్ల కోసం వాళ్లకు ఫోన్లు రావడం విచిత్రాల్లో విచిత్రం. నిన్న మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు తేడా లేకుండా దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఓవర్ ఫ్లోస్ పక్క సినిమాలకు ఉపయోగపడ్డాయి.

కేవలం నాలుగు రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ దాటడం దిమ్మదిరిగిపోయేలా చేస్తోంది. బ్రాండ్ న్యూ డేని ఒక్కసారైనా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్ పీరియన్స్ అవ్వాల్సిందేనని జనాలు ఫిక్స్ కావడం వల్ల ఈ స్థాయి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఏపీ తెలంగాణలో తెలుగు వెర్షన్ కే ఎక్కువ డిమాండ్ ఉన్న వైనం స్పష్టం. హైదరాబాద్ లాంటి ఏ సెంటర్స్ లో ఇంగ్లీష్ కి ప్రాధాన్యం ఇస్తున్నా కింది కేంద్రాల్లో మాత్రం డబ్బింగ్ బొమ్మ ఎక్కడ ఆడుతుందో చూసి మరీ టికెట్లు కొనుక్కుంటున్నారు.

ఈ వసూళ్ల దెబ్బకు టామ్ హాలండ్ మన హీరోల సరసన చేరిపోయాడు. అదెలాగంటే సింగల్ డేలో వంద కోట్ల గ్రాస్, నాలుగు రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ దాటేన అతి కొద్దిమంది హీరోల్లో ఇతగాడి పేరు తోడయ్యింది. ఇప్పటికేదాకా ఈ లిస్టులో ఉన్న రజనీకాంత్, విజయ్, ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రణ్వీర్ సింగ్ పక్కన టామ్ హాలండ్ చోటు దక్కించుకున్నాడు. ఇది తెలుసుకున్న సోషల్ మీడియా ఫ్యాన్స్ సంబరం మాములుగా లేదు.

అయితే ఇదేదో నాలుగు రోజులకు పరిమితమైన నీటి బుడగ హడావిడి కాదు సోమవారం బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం షోలు ఫుల్స్ పడటం పక్కా. ఇదే జోరు ఇంకో వీకెండ్ కూడా ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. మన దగ్గర కొరియన్ కనకరాజు, కెజెక్యూ, డిసి లాంటి చెప్పుకోదగ్గ రిలీజులు ఉన్నాయి కానీ వాటి ప్రభావం సాలీడు మనిషి మీద ఏ మేరకు ఉంటుందో చెప్పలేం. ఏదైతేనేం స్పైడర్ మ్యాన్ యూఫోరియా ఇప్పట్లో మర్చిపోయేది కాదు. 

This post was last modified on August 3, 2026 4:18 pm

Share

Recent Posts

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

59 minutes ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

2 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

2 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

3 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

3 hours ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

3 hours ago