ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే ముద్ద దిగని వారి పరిస్థితి ఏమిటంటారా? ఖరీదు ఎక్కువైనా మటన్ షాపులకు దారి తీయడమొక్కటే మార్గం. అయితే చికెన్ ముక్కకు అలవాటు పడ్డ వారు మటన్ షాపులకు అంతగా వెళ్లలేరు కదా. మరి ఎలా అంటారా? ఏలా ఏమిటి? చికెన్ షాపులు తెరిచేదాకా వేచి చూడాల్సిందే. అప్పటిదాకా ముక్క మాటను పక్కన పెట్టాల్సిందే.
అయినా తెలంగాణలో బుధవారం నుంచి చికెన్ దొరకకపోవడానికి కారణమేమిటంటే… రాష్ట్రంలోని చికెన్ షాపులన్నీ మూత పడనున్నాయట. ఈ మేరకు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం ఓ సంచనల ప్రకటనను విడుదల చేసింది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేస్తున్నామని సదరు ప్రకటనలో అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి తిరిగి షాపులను తెరుస్తామన్న విషయాన్ని మాత్రం అసోసియేషన్ వెల్లడించలేదు.
అయినా చికెన్ షాపులన్నీ కట్టకట్టుకుని మూత పడటానికి గల కారణాలేమిటన్న విషయానికి వస్తే… ఫారం కోళ్లను పౌల్ట్రీ ఫారాల నుంచి చికెన్ షాపులు తీసుకుంటున్నాయి. ఇలా తమ కోళ్లను చికెన్ గా మలచి విక్రయిస్తున్న చికెన్ షాపులకు పౌల్ట్రీ యాజమాన్యాలు కమీషన్ ను అందిస్తున్నాయి. ఈ కమీషన్ ను ఇటీవలి కాలంలో ఏమాత్రం పెంచలేదట.
దీంతో మారిన కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా తమకు కమిషన్ పెంచాల్సిందేనని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నా… పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోలేదట. దీంతో చికెన్ షాపుల బంద్ కు అసోసియేషన్ పిలుపునిచ్చింది. మరి ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుందో చూడాలి.
This post was last modified on March 31, 2026 7:47 pm
ఒక సూపర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వచ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంతగా వాడుకోవడానికే ప్రయత్నిస్తాడు. నటనలో తండ్రిని అనుకరించడం.. తన…
కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్న మాట వాస్తవమేనని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…
వైసీపీ అధినేత జగన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే తప్ప.. ఎప్పుడూ ఆయన…
అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…
రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…