హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై శాతంకి పైగా ఆక్యుపెన్సీల్లో డ్రాప్ ఉన్నట్టు సమాచారం. ఇది చాలా సీరియస్ గా చూడాల్సిన విషయమే. ఎందుకంటే ఎంత వీక్ డే అయినప్పటికీ ఇలాంటి బ్లాక్ బస్టర్లు కనీసం యాభై శాతంకు పైగా హోల్డ్ చూపించాలి. కానీ మరీ నలభైకి దిగిపోవడం మంచి సంకేతం కాదు. అందులోనూ రెండు వేల కోట్ల గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకున్నప్పుడు.
దీనికి కారణాలు ఏంటో విశ్లేషిద్దాం. దురంధర్ మొదటి భాగం ఫస్ట్ డే కాస్త నెమ్మదిగా మొదలై తర్వాత అనూహ్యంగా పికప్ అయిపోయి నెల రోజుల పాటు స్ట్రాంగ్ గా నిలబడింది. ఇతర బాషల డబ్బింగ్ వెర్షన్లు లేకుండానే గొప్ప ఫీట్ సాధించింది. అయితే రివెంజ్ తడబడుతోంది. ముందుగా చెప్పుకోవాల్సింది ఐపీఎల్ సీజన్ గురించి. సాయంత్రం ఆరు గంటల నుంచి దీని సందడి మొదలవ్వడంతో ఈవెనింగ్, నైట్ షోల మీద ప్రభావం పడుతోందని మల్టీప్లెక్సులు అంటున్నాయి.
ఇది కాకుండా పైరసీలో మంచి ప్రింట్ వచ్చేయడం ప్రత్యక్షంగా దెబ్బ కొడుతోందని అంటున్నారు. మండిపోతున్న ఎండల్లో నాలుగు గంటలు ఏసీలో సేద తీరేందుకు చాలా మంది థియేటర్లకు వెళ్ళడానికి ప్రాధాన్యం ఇస్తారు. దురంధర్ దాన్ని కొన్ని చోట్ల క్యాష్ చేసుకుంటున్న మాట వాస్తవం. అయితే దురంధర్ 1 లాగా ఈ రివెంజ్ రిపీట్ ఆడియన్స్ ని రప్పించడం లేదని ఒక అనాలిసిస్ లో తేలుతున్న వాస్తవం. మళ్ళీ మళ్ళీ చూసేందుకు ఫ్యాన్స్ రావడం లేదట.
ఈ లెక్కన పుష్ప 2ని దాటేసి రెండు వేల కోట్ల మార్కుని అందుకోవడం దురంధర్ రివెంజ్ కి కష్టమయ్యేలా ఉంది. కాకపోతే వీకెండ్ కనక మళ్ళీ పికప్ చూపిస్తే టార్గెట్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్షయ్ ఖన్నా రేంజ్ లో సీక్వెల్ లో ఒక బ్యాంగర్ క్యారెక్టర్ లేకపోవడం లోపంగానే చెప్పాలి. సరే ఫైనల్ స్టేటస్ తేలడానికి ఇంకా టైం ఉంది కానీ దర్శకుడు ఆదిత్య ధార్ మాత్రం కేవలం మూడు నెలల్లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి సరికొత్త చరిత్ర సృష్టించడాన్ని ఎవరూ కాదనలేరు.
This post was last modified on March 31, 2026 6:07 pm
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…