గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. రేపటి (బుధవారం) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2026 ఏప్రిల్ 1- 2027 మార్చి 31) షురూ కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
రిజర్వు బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులు తమ ఖాతాదారుల లావాదేవీల రూల్స్ ను సవరిస్తున్నాయి. ఏటీఎం కార్డు అవసరం లేకుండా.. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు విత్ డ్రా చేసే వెసులుబాటు బ్యాంక్ ఖాతాదారులకు ఫ్రీగా ఉండేది. లేదంటే అదనపు లావాదేవీగా వినియోగించుకునే వారు.
అందుకు భిన్నంగా ఏప్రిల్ 1 నుంచి పరిమితులు మొదలు కానున్నాయి. వివిధ బ్యాంకులు తమకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తో పాటు పలు బ్యాంకులు ఏటీఎంలలో చేసే యూపీఐ ఆధారిత నగదు విత్ డ్రాను.. నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీగా పరిగణించనున్నారు. ఉచిత లావాదేవీ పరిమితి ముగిసిన తర్వాత.. యూపీఐ ద్వారా చేసే ప్రతి విత్ డ్రా మీదా రూ.23తో పాటు.. అదనంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు వీుగా డిజిటల్ చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఓటీపీ మాత్రమే కాదకుండా పిన్ లేదంటే బయోమెట్రిక్ లాంటి అదనపు ధ్రువీకరణ తప్పనిసరి చేయనున్నారు.
దీంతో.. ఇప్పటివరకు ఉన్న సింగిల్ లైన్ సెక్యూరిటీకి భిన్నంగా డ్యూయల్ సెక్యూరిటీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు.. యాప్ ల ద్వారా పదే పదే బ్యాలెన్స్ తనిఖీ చేస్తే నామమాత్రపు ఛార్జీలు వసూలు చేసేలా బ్యాంకులు పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో అదే పనిగా బ్యాలెన్సుల్ని చెక్ చేసుకునే అలవాటు ఉంటే.. కాస్త మార్చుకోవటం మంచిది.
డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం నగదు విత్ డ్రాకు సంబంధించి పలు బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులు చేయనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే.. నగదు విత్ డ్రా మొత్తాన్ని సగానికి తగ్గించింది. చాలా కార్డులకు రోజువారీ విత్ డ్రా పరిమితిని రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బంధన్ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచిత ఆర్థిక లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే మెట్రో నగరాల్లో మూడు లావాదేవీలు మాత్రమే ఉచితం.ఈ పరిమితి దాటితే.. ప్రతి లావాదేవీకి రూ.10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
This post was last modified on March 31, 2026 9:21 am
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…