ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ ఇచ్చాం… అమలు సంగతి తర్వాత చూద్దాం అనే ఫక్తు రాజకీయ నేతల మాదిరిగా కాకుండా చేయాలనుకున్న సాయాన్ని రేవంత్ రెడ్డి అప్పటికప్పుడే చేసేస్తున్నారు. రేవంత్ లోని ఈ తరహా వైఖరితో ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా దక్కింది. శివ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేసిన రేవంత్… తక్షణ ఆర్థిక సాయంతో పాటు సుస్థిత ఉపాధి లభించేలా చర్యలు తీసుకున్నారు.
ట్యాంక్ బండ్ వేదికగా వందలాది మంది ప్రాణాలను కాపాడిన శివ… ట్యాంక్ బండ్ శివగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే శివ కుటుంబం పేదరికంతో సతమతమవుతోంది. ఇల్లు లేక, కుటుంబాన్ని పోషించుకునే ఉపాధి లేక శివ నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రేవంత్…మంగళవారం శివ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకున్నారు. శివ కుటుంబంతో పూర్తి స్థాయి వివరాలను ఆరా తీసిన రేవంత్… ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.5 లక్షలను అందించారు. ఈ సాయాన్ని ఏదో ప్రకటనకే పరిమితం చేయని రేవంత్… అప్పటికప్పుడే ఆ సాయానికి చెందిన చెక్కును శివ చేతిలో పెట్టారు.
ఇక శివ కుటుంబానికి శాశ్వత ఆవాసం లేదన్న విషయం తెలుసుకున్న రేవంత్ తక్షణమే ఆయనకు ఓ డబుల్ బెడ్ రూం ఇంటిని ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ ఆర్థిక సాయం, ఇల్లు కేటాయింపు ఓకే మరి శాశ్వత ఉపాధి ఎలా అన్న దిశగా ఆలోచించిన రేవంత్… శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగం ఇచ్చారు.
నియామక పత్రాన్ని అక్కడికక్కడే అందజేశారు. ఇంకేం కావాలని రేవంత్ అడగగా… ట్యాంక్ బండ్ పరిధిలో ఓ స్విమ్మింగ్ పూల్ కావాలని శివ కోరాడు. అందుకూ సరేనన్న రేవంత్… ట్యాంక్ బండ్ పరిధిలో ఓ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి దానిని శివకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా రేవంత్ ఒక్క దెబ్బతో శివ కుటుంబం శాశ్వతంగా సంతోషంగా జీవనం సాగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
This post was last modified on March 31, 2026 10:46 pm
ప్యాన్ ఇండియా సినిమాలకు బజ్ కొనసాగాలంటే ఎప్పటికప్పుడు కొత్త సమాచారం ఇస్తూ ఒక టెంపో మెయింటైన్ చేయడం చాలా అవసరం.…
హిట్టు ఫ్లాపు పక్కన పెడితే వందల కోట్ల బడ్జెట్ తో ఒక ప్రాజెక్టు హ్యాండిల్ చేసిన ఏ దర్శకుకిడైనా తర్వాత…
జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. తమిళనాడులో అరాచకం స్పెల్లింగ్ రాయిస్తుండగా ఏపీ తెలంగాణలో స్ట్రాంగ్…
రణబాలి క్రమంగా నెమ్మదిస్తోంది. ఇప్పటిదాకా దసరా సెలవులు, రెండు వీకెండ్స్ క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ ఆయిన విజయ్ దేవరకొండకు వరస…
హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ ఎంచుకున్న సినిమాల్లో మిరాయ్ కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడంతో…
https://youtu.be/GBEMMz7D6C8?si=HbG0xf2skHBR-huG 2015 జూలై 14న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన…