Trends

టెన్షన్ లేకుండా ఓడిన CSK.. ఏంటో ఈ ఆట!

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన బలహీనతలను బయటపెట్టుకుంది. బౌలింగ్‌లో పస లేదు, బ్యాటింగ్‌లో నిలకడ లేదు, ఫీల్డింగ్‌లో స్ఫూర్తి లేదు. అసలు ఎందుకు ఆడుతున్నామో అన్నట్లు.. ఏంటో ఈ ఆట అన్నట్లు మ్యాచ్ సాగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ తన వ్యూహాలతో చెన్నై బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయగా అన్ని విభాగాల్లోనూ సీఎస్‌కే తేలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కేవలం 127 పరుగులకే కుప్పకూలింది.

ఈ స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే ఊదేసి, 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ​చెన్నై బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్‌లో అత్యంత నీరసంగా కనిపించింది. వరల్డ్ కప్ హీరో సంజూ శామ్సన్ (6), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), భారీ హిట్టర్ శివం దూబే (6) వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమై పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక వేలంలో 14 కోట్లు పెట్టి కొనుక్కున్న కార్తీక్ శర్మ (18) కూడా దారుణంగా విఫలమయ్యాడు. 

వికెట్లు పడుతున్నా కనీసం క్రీజులో నిలబడి స్కోరును ముందుకు తీసుకెళ్దామనే కనీస తెగింపు ఏ బ్యాటర్‌లోనూ కనిపించలేదు. జేమీ ఓవర్టన్ (43) ఒక్కడే కాస్త పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా బోర్డుపైకి చేరింది. రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కోవడంలో చెన్నై బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ​ఫీల్డింగ్ విషయంలో కూడా చెన్నై ఆటతీరు మరీ దారుణంగా ఉంది. మ్యాచ్ మొదటి ఓవర్ నుంచే ఏదో నీరసంగా ఆడుతున్నట్లు అనిపించింది తప్ప, గెలవాలనే కసి ఎక్కడా కనిపించలేదు. 

ముఖ్యంగా ఇన్నింగ్స్ మొదట్లోనే వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన క్యాచ్‌ను కార్తీక్ శర్మ వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆ ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకున్న సూర్యవంశీ.. చెన్నై బౌలర్లపై విరుచుకుపడి కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశాడు. ఫీల్డర్ల మధ్య సమన్వయం లేకపోవడం, అనవసరంగా పరుగులు ఇవ్వడం చెన్నై ఓటమిని వేగవంతం చేసింది. ​కెప్టెన్సీ పరంగా చూస్తే రుతురాజ్ గైక్వాడ్ పాత పద్ధతులనే ఫాలో అవుతూ ఏమాత్రం ప్రయోగాలు చేయలేదు. 

రాజస్థాన్ ఓపెనర్లు సూర్యవంశీ (52), యశస్వి జైస్వాల్ (38 నాటౌట్) విధ్వంసం సృష్టిస్తున్నా బౌలింగ్ మార్పుల్లో గైక్వాడ్ విఫలమయ్యాడు. అదే సమయంలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లను ఎప్పటికప్పుడు మారుస్తూ చెన్నై బ్యాటర్లను కుదురుకోనివ్వకుండా చేశాడు. పరాగ్ వేసిన ప్లాన్లకు చెన్నై దగ్గర సమాధానమే లేకపోయింది. చివరికి పరాగ్ (14 నాటౌట్) స్వయంగా క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. ఇక చెన్నై పాత పద్ధతులను పక్కన పెట్టి కొత్త ఉత్సాహంతో పుంజుకోకపోతే, ఈ సీజన్‌లో వారికి గడ్డు పరిస్థితులు తప్పవు.

Kumar

Recent Posts

ఎన్నిక‌ల ముంగిట బీజేపీకి అయోధ్య ఎఫెక్ట్ ఎంత‌?

బీజేపీకి అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ముందు చెల‌రేగిన అయోధ్య రామ‌మందిర వివాదం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. దేశంలోనే…

60 minutes ago

కేటీఆర్ తప్పు ఒప్పేసుకున్నట్టేగా!

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన పార్టీగా బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)కు ఓ ప్రత్యేక గుర్తుంపు అయితే ఉంది. అయినంత మాత్రాన…

1 hour ago

ఆడియన్స్ పోస్టుల వల్ల సినిమా హిట్టయ్యిందా

మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నిజమే.ఎవరూ కాదనలేరు. అయితే ఇవాళ వైజాగ్ లో జరిగిన…

2 hours ago

తెలుగు కుర్రాడికి రజినీ సినిమాలో ఛాన్స్

తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…

13 hours ago

ఓజీ-2: పవన్ మారాలి… సుజీతూ మారాలి

అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…

14 hours ago

రెహమాన్ కంబ్యాక్ జరిగిందా లేదా

పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…

16 hours ago