Political News

విల్లాల‌ను త‌ల‌పించేలా ఇళ్లు.. పేద‌ల ఇంటి క‌ల నెర‌వేర్చిన బాబు

సాధార‌ణంగా పేద‌లకు ప్ర‌భుత్వాలు క‌ట్టించి ఇచ్చే ఇళ్లు.. అన‌గానే ఎలాంటి వ‌స‌తులు ఉండ‌వ‌ని.. ఇరుకు ఇరుగ్గా ఉంటాయ‌ని భావిస్తారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు ఇలాంటి ఇళ్ల‌నే పేద‌ల‌కు క‌ట్టించి ఇస్తాయ‌న్న వాద‌న కూడా ఉంది. కానీ, ఏపీలో దీనికి భిన్నంగా తొలిసారి .. విల్లాల‌ను త‌ల‌పించేలా పేద‌ల‌కు ఇళ్ల‌ను నిర్మించారు. కేవ‌లం 18 మాసాల వ్య‌వ‌ధిలోనే తిరుప‌తిలోని పుదూరులో వీటిని నిర్మించారు. వీటిలో ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించారు. సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ఇళ్ల‌ను ఏ ప్ర‌భుత్వ‌మూ నిర్మించలేద‌ని చంద్ర‌బాబు తెలిపారు.

ఏక‌కాలంలో 2.5 ల‌క్ష‌ల ఇళ్లు..

తిరుప‌తి జిల్లా పుదూరులో నిర్మించిన సుమారు ల‌క్షా 50 వేల ఇళ్ల‌ను సోమ‌వారం సాయంత్రం చంద్ర‌బాబు ప్రారంభించారు. అనంత‌రం.. ల‌బ్ధి దారుల‌తో గృహ ప్ర‌వేశాలు చేయించారు. అంతేకాదు.. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో ల‌క్ష ఇళ్ల‌ను కూడా వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించి.. ల‌బ్ధిదారులకు తాళాలు అందించారు. వాటిలోనూ గృహ ప్ర‌వేశాలు చేయించారు. త‌ద్వారా ఏక‌కాలంలో 2.5 ల‌క్ష‌ల టిడ్కో నివాసాల‌ను పేద‌ల‌కు అందించిన‌ట్టు అయింది. కాగా.. ఈ గృహాల నిర్మాణంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వాటాతో పాటు ల‌బ్ధిదారుల వాటా కూడా ఉంది.

వ‌స‌తులు ఇవీ..

తాజాగా ల‌బ్ధిదారుల‌కు అందించిన టిడ్కో నివాసాల్లో విల్లాల‌ల‌ను త‌ల‌పించేలా నిర్మ‌ణాలు చేశారు. బ‌య‌ట సువిశాల‌మైన మైదానాల‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తిటిడ్కో నివాసంలో 100 ఫ్లాటులు ఉన్నాయి. వీటికి ప్ర‌త్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. అదేవిధంగా ప్ర‌తి 100 ఫ్లాట్ల‌కు.. ఒక పార్కును ఏర్పాటు చేశారు. వాహ‌నాలకు పార్కింగ్ ఏరియాను ప్ర‌త్యేకంగా చూపించారు. అదేవిధంగా వాకింగ్ ట్రాక్‌ల‌కు మ‌ధ్య‌లో విశ్రాంతి తీసుకునేందుకు బెంచీల‌ను ఏర్పాటు చేశారు. వాట‌ర్ స‌దుపాయంతోపాటు ఇంటింటికీ గ్యాస్ ఇచ్చే పైపు లైన్ల‌ను కూడా క‌ల్పించారు. ఇంటీరియ‌ర్ విష‌యానికి వ‌స్తే.. క‌ప్ బోర్డుల‌ను ఏర్పాటు చేశారు.

ల‌బ్ధిదారులు హ్యాపీ!

గ‌తానికి భిన్నంగా ఉన్న టిడ్కో ఇళ్ల‌ను చూసి ల‌బ్ధిదారులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఒక్కొక్క ఫ్లాట్‌లో 850 ప్లింత్ ఏరియాతో పాటు.. 33 గ‌జాల అన్ డివైడెడ్ షేర్‌ను ఇచ్చారు. అలాగే.. ఓపెన్ ఏరియాలో మెట్లు.. మాత్ర‌మే ఏర్పాటు చేశారు. కారిడార్లు విశాలంగా నిర్మించారు. దీంతో ల‌బ్ధిదారులు ఒక ప్రైవేటు అపార్ట్‌మెంటును కొనుగోలు చేసినంత ఆనందం వ్య‌క్తం చేశారు. రంగురంగుల‌తో మెరిసిపోతున్న ఇళ్ల‌ను చూసుకుని మ‌హిళ‌లు ఆనందంతో మురిసిపోయారు. పాలు పొంగించి గృహ ప్ర‌వేశాలు చేశారు.

This post was last modified on March 30, 2026 11:17 pm

Share

Recent Posts

అన్న రాలేదు.. వదినమ్మ ఒక్కరే ఎందుకు?

విజయ్ దేవరకొండ.. తమ్ముడి కెరీర్ మొదట్లో సినిమాలకు తనవంతు పుష్ ఇచ్చాడు. కానీ ఆనంద్‌కు సొంతంగా పేరు రావడం మొదలయ్యాక…

2 minutes ago

మహాకాళి ముందు జాగ్రత్త పడుతోంది

హనుమాన్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాణంలో మహాకాళి రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా…

33 minutes ago

రాజకీయాలకు అయ్యన్న గుడ్ బై

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ…

1 hour ago

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్…

3 hours ago

విజయశాంతికి బెర్త్ ఖరారు?

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖరారైనట్లు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల మంత్రి…

4 hours ago

రామాయణ ప్లానింగ్ ఇలాగేనా ఉండాల్సింది

ఇండియా కాస్ట్లీ మూవీగా చెప్పుకుంటున్న రామాయణ విడుదల కేవలం ఇంకో రెండు నెలల్లో ఉంది. ఇంత తక్కువ సమయం ఉన్నా…

4 hours ago