Trends

పెట్రోల్ బంకులు బంద్? అసలు నిజమేంటి?

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రోజులుగా భారత్ లో వంటగ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆ సెగ పెట్రోల్, డీజిల్ కు కూడా తాకింది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాదులో చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉన్న బంకుల దగ్గర జనాలు బారులు తీరారు.

తమ వాహనాలతో కొంతమంది, కంటైనర్లలో డబ్బాలలో పెట్రోల్ ను నిల్వ చేసుకొని మరి కొంతమంది తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ నిల్వలకు ఢోకా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం బంకులు మూతపడతాయి అన్న వదంతులతో పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకునేందుకు బారులు తీరుతున్నారు.

ఇదే విషయంపై వదంతులు నమ్మవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రకటన చేసినా ఫలితం లేదు. మరోవైపు అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని, రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ ప్రకటించింది. తెలంగాణలోని అన్ని పెట్రోలియం కంపెనీల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని ప్రకటన విడుదల చేసింది.

ప్రజలెవరూ కంగారు పడొద్దని, వదంతులు నమ్మవద్దని, అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో మాదిరిగానే రోజువారి అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు

This post was last modified on March 25, 2026 11:14 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

30 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

1 hour ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago