మాగంటి ఇంట్లో మరో విషాదం!

దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న మాగంటి చిన్న కూతురు దిశరతోపాటు మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.

ప్రస్తుతం వారికి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు చక్రం ఒక్కసారికి ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని మరో ప్రచారం జరుగుతుంది.

శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమ స్నేహితులను విమానాశ్రయంలో డ్రాప్ చేసి వస్తుండగా నార్సింగ్ పోలీస్‌ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.