Trends

నెల రోజుల పసికందుకి ఆకలి మృతి

బరేలీలోని ఖిలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక నెల రోజుల పసికందు ఆకలితో అల్లాడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. కన్నవారు పొట్ట కూటి కోసం బిచ్చమెత్తుకోవడానికి బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో దిక్కులేక ఆ పసిగుడ్డు కన్నుమూసింది. లాక్‌డౌన్ తర్వాత ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం, కనీసం తిండి కూడా లేక అడుక్కునే స్థితికి చేరుకోవడం ఈ విషాదానికి ప్రధాన కారణం.

మొహమ్మద్ షాదాబ్ అనే వ్యక్తి గతంలో గాలిపటాల మాంజా వ్యాపారంలో ఉండేవాడు. అయితే కోవిడ్ సమయంలో పనులు ఆగిపోవడంతో ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా పని దొరకకపోవడంతో, చివరకు భార్య హీనాతో కలిసి అడుక్కునే దారి ఎంచుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా, అందరికంటే చిన్నదైన నెల రోజుల పాపను, మిగిలిన ఇద్దరు పిల్లల (నాలుగేళ్లు, ఏడాదిన్నర) వద్ద వదిలేసి దంపతులిద్దరూ శుక్రవారం ఉదయం భిక్షాటనకు వెళ్లారు.

రోజంతా బయట తిరిగి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వారు ఇంటికి వచ్చేసరికి, నెల రోజుల పాప స్పృహ లేకుండా పడి ఉంది. కంగారుపడి చూడగా అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఇన్ఫెక్షన్, అనారోగ్యం కారణంగా మరణం సంభవించిందని తేలినా, పాలు కూడా లేని ఆకలి వల్లే పాప చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఈ కుటుంబానికి ఇలాంటి కష్టం రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వీరి ఆరు నెలల బాబు ఇలాంటి పరిస్థితుల్లోనే మరణించాడు. వరుస విషాదాలు వెంటాడుతున్నా, వారిని ఆదుకునే వారు లేకపోవడంతో ఆ దంపతులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఆ పాప మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత, ఇంటి అద్దె కట్టలేక షాదాబ్ తన మిగిలిన ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం వారు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు.

This post was last modified on March 23, 2026 3:09 pm

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

9 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

14 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

9 hours ago