Trends

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. లీగ్ దశలో తిరుగులేని ఫామ్ లో కనిపించిన మన బ్యాటర్లు, కీలకమైన ఈ మ్యాచ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేయడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకు భారత బౌలర్లు మొదట్లోనే గట్టి షాక్ ఇచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి టాప్ 3 బ్యాటర్లు కేవలం 20 పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే ఆ దశలో డేవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45) అద్భుతమైన భాగస్వామ్యంతో సఫారీలను ఆదుకున్నారు. భారత బౌలర్లు మధ్య ఓవర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. సఫారీ బౌలర్ల పక్కా ప్లానింగ్ ముందు మన స్టార్ బ్యాటర్లందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. శివం దూబే (42) ఒక్కడే కాస్త పోరాడినప్పటికీ, మిగిలిన వారందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయి, ఈ టోర్నీలో తన మొదటి ఓటమిని మూటగట్టుకుంది.

సూపర్ 8 పాయింట్ల పట్టికలో ఈ ఓటమి భారత్‌ను కష్టాల్లోకి నెట్టింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఇకపై జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న తప్పు జరిగినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉండటంతో వచ్చే మ్యాచ్‌లు భారత్‌కు డూ ఆర్ డైగా మారాయి. టీమిండియా తన తదుపరి పోరులో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, ఆ తర్వాత మార్చి 1న వెస్ట్ ఇండీస్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు కూడా ప్రస్తుత ఫామ్ లో చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మరి ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని, బ్యాటింగ్ లో లోపాలను సరిదిద్దుకుని భారత్ మళ్ళీ విజయాల బాట పడుతుందో లేదో వేచి చూడాలి.

This post was last modified on February 22, 2026 11:08 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago