Movie News

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం చేయబోతోంది. కొడుకు ప్రణవ్ ఆల్రెడీ హీరో అయిపోయి సెటిలయ్యే క్రమంలో ఉండగా ఇప్పుడు తనయ వంతు వచ్చింది. నిన్న ట్రైలర్ లాంచ్ చేశారు. విశేషం ఏమిటంటే ఇందులో మోహన్ లాల్ కూడా నటించారు. అది గెస్ట్ రోలా లేక ఎక్కువ కనిపించే స్పెషల్ క్యామియోనా అనేది వేచి చూడాలి. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతానికి రావడం లేదు.

అసలు విషయానికి వస్తే విస్మయ మోహన్ లాల్ డెబ్యూకి క్రైమ్ థ్రిల్లర్ నే ఎంచుకుంది. దృశ్యం షేడ్స్ చాలానే కనిపిస్తున్నాయి. ఒక హిల్ స్టేషన్ లో చదువు, ఉద్యోగం కోసం వెళ్లిన ఓ చిన్న కుటుంబం అనుకోకుండా ప్రమాదంలో పడుతుంది. రాత్రి అయితే చాలు ఆగంతకుల వల్ల అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అసలు వీళ్ళను వెంటాడుతున్నది ఎవరు, పోలీసుల వచ్చేంత తప్పు అక్కడేం జరిగిందనేది అసలు స్టోరీగా అర్థమవుతోంది. ట్విస్టులు చాలానే ఉన్నాయి.

లుక్స్ పరంగా విస్మయ చాలా బొద్దుగా ఉంది. తండ్రి పోలికను పుణికిపుచ్చుకున్న ఈ అమ్మాయి పెర్ఫార్మన్స్ గురించి కేవలం ట్రైలర్ చూసి అంచనాకు రాలేం కానీ చూపించిన కాసిన్ని సీన్స్ లోనూ హుషారుగా చలాకీగా కనిపించింది. మాములుగా స్టార్ హీరోల కూతుళ్లను తెరమీదకు తీసుకురావడాన్ని ఫ్యాన్స్ అంతగా ఇష్టపడరు. కమల్ హాసన్ లాగే మోహన్ లాల్ కూడా వాటిని పట్టించుకునే ఉద్దేశంలో లేరు. అందుకే వారసురాలిని ప్రోత్సహిస్తున్నారు.

మలయాళం డబ్బింగులు థియేటర్ పరంగా మన దగ్గర అంతగా వర్కౌట్ కావడం లేదు. అందుకే ఒరిజినల్ వెర్షన్ ఫలితం చూశాక అప్పుడు నిర్ణయం తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మూడేళ్ళ క్రితం కేరళ వరదల మీద 2018 లాంటి అద్భుతమైన సినిమా తీసిన జూడ్ ఆంటోనీ జోసెఫ్ దానికి దర్శకుడు కావడం విశేషం. విస్మయు కనక ఈ తుదక్కంతో మెప్పించగలిగితే ఇదే తరహాలో స్వంత బ్యానర్ లో వరసగా సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారట. చూడాలి మరి ఏమవుతుందో.

This post was last modified on August 4, 2026 10:21 am

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

27 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

31 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

1 hour ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

2 hours ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

2 hours ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago