పెళ్లికి ముందు సెక్స్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. యువతీ యువకులు .. తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని దీనికి అనేక మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనేంత వీక్ అయితే.. సంసారాలు కూడా అంతే వీక్‌గా ఉంటాయని అనడం సంచలనంగా మారింది. పెళ్లి అనేది రెండుకుటుంబాలను ఏకం చేసే పవిత్రమైన వ్యవహారమని.. కేవలం సెక్స్ కాదని వ్యాఖ్యానించింది.
అంతేకాదు.. పెళ్లికి ముందే సెక్స్ ఎందుకు? ఆగలేకపోతున్నారా? అంటూ.. ఓ యువతిని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ కేసును ఏం చేయాలో కూడా తమకు తట్టడం లేదని పేర్కొంది. ఎవరిది తప్పు అని తేల్చేందుకు కూడా అవకాశం లేకుండా పోవడంపై న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయిన యువకుడితో ఓ యువతి పెళ్లి ముందే పలు మార్లు సెక్స్‌లో పాల్గొంది. అనంతరం.. కొన్నాళ్లకు సదరు యువకుడికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్టు తెలుసుకుని నిర్ఘాంత పోయింది. కానీ అప్పటికే ఆమె గర్భం దాల్చింది.
దీంతో కుటుంబంతో సహా కలిసి సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని.. అన్నీ తెలిసే యువతి తనతో సెక్స్ లో పాల్గొందని.. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని సదరు వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.
దీనిని సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లు.. యువతి వ్యవహారంపై తీవ్రంగా మండి పడ్డారు. మంచి చెడులు విచారించుకోకుండా.. అసలు ఆ యువకుడి పూర్వాపరాలు తెలుసుకోకుండా ప్రయివేటుగా అతనిని కలుసుకోవడం సరికాదని పేర్కొన్న ధర్మాసనం .. పెళ్లి ముందు సెక్స్ అవసరం ఏంటని యువతిని నిలదీసింది. ఈ కేసులో యువకుడికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించింది.
This post was last modified on February 17, 2026 8:25 am
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…