బెంగళూరులో జరిగిన ఓ సంఘటన అక్కడి స్థానికులను షాక్‌కు గురిచేసింది. గీజర్ రిపేర్ పేరుతో ఇంట్లోకి వచ్చిన ఓ యువకుడు, గీజర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి వీడియో తీశాడు అని, తన భార్య నగ్న వీడియో నెట్‌లో ప్రత్యక్షం అవుతుందన్న అనుమానంతో భర్త ఆ యువకుడిపై దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాకుండా తన భార్యను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నం చేశాడని చితకబాదిన తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించాడు.
ఇంకా విచారణలోకి దిగిన పోలీసులు, గీజర్‌లో కెమెరా అమర్చడం సాధ్యమేనా అని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో విచారించిన పోలీసులు, గీజర్‌లో కెమెరా అమర్చడం అసాధ్యమని నిర్ధారించారు. దీంతో కేసులో ఉన్న అనుమానాలపై సున్నితంగా ఆ యువతి దగ్గర ప్రశ్నలు వేయగా ఆమె ఆశ్చర్యకర నిజాన్ని బయటపెట్టింది.
ఆ వీడియో తీసింది తానేనని, తనను తాను నగ్నంగా వీడియో తీసి, తన ప్రియుడికి పంపించానని ఆమె ఒప్పుకుంది. భర్త అడిగినప్పుడు తన తప్పును దాచేందుకు గీజర్ రిపేర్ కు వచ్చిన వ్యక్తిని ఇరికించేందుకు ప్రయత్నించానని ఆమె వెల్లడించింది. అంతేకాదు, రిపేర్ చేసే వ్యక్తే తన ప్రియుడని, అతడిని సంతోషపెట్టడానికి ఇలా చేసినట్లు అసలు నిజం బయటపెట్టింది. ఇక ఇలాంటి పరిణామాలతో ఆమె భర్త, మాత్రమే కాదు, పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.