భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించడంలో తిలక్ కీలక పాత్ర పోషించాడు. అతడి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ భారత విజయానికి బలమైన ఆధారంగా నిలిచింది.
ఈ ప్రదర్శనతో తిలక్ అరుదైన రికార్డును సొంతం చేసుకొని, టీమిండియాలో తన స్థానాన్ని మరింత బలపరచుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా తిలక్ నిలిచాడు.
తాజాగా తిలక్ వర్మ వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో (19*, 120*, 107*, 72*) ఔట్ కాకుండా 318 పరుగులు సాధించాడు. ఈ ఫీట్‌తో అతడు న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్మన్ యొక్క 271 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
అంతేకాక, విరాట్ కోహ్లీని కూడా వెనక్కి నెట్టి, ఈ ఘనతను సాధించాడు. టీమిండియాలో కోహ్లీ గతంలో 258 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు తిలక్ తన అద్భుత ప్రదర్శనతో ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ 318* పరుగులతో ముందంజలో ఉండగా, అతని వెంట విరాట్ కోహ్లీ (258), సంజూ శాంసన్ (257), రోహిత్ శర్మ (253), శిఖర్ ధావన్ (252) వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ రికార్డుతో తిలక్ భారత క్రికెట్‌లో కొత్త ట్రెండ్ ప్రారంభించాడు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, భారత బ్యాటింగ్ తొలుత తడబడింది. అయితే తిలక్ తన ఒంటరి పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించాడు. 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో తన 72 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయం భారత జట్టును ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates