సంక్రాంతి రద్దీతో ఏపీఎస్ఆర్టీసీకి డబ్బే డబ్బు

ఈ సంక్రాంతి ఏపీకి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే… పండుగకు ముందు ప్రభుత్వం మారింది. కూటమి కొత్త సర్కారు పాలన మొదలు కాగానే… రాష్ట్రంలో ఓ నూతన ఒరవడి కనిపించింది. పాలనలో దూకుడుతో వెళుతున్న కూటమి సర్కారు ఎక్కడిక్కడ తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలో కొత్త ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదే  ఉత్సాహం  సంక్రాంతి వేడుకల్లో కనిపించింది.

బుధవారంతో సంక్రాంతి వేడుకలు పూర్తీ కాగా… సొంతూళ్లకు వెళ్లిన వారంతా బుధవారం రాత్రి నుంచే తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆయా ప్రాంతాల నుంచి పట్టణాలు… ప్రత్యేకించి హైదరాబాద్ కు దారితీసే ప్రధాన రహదారులు అన్నీ రద్దీగా మారిపోయాయి. ఈ రద్దీతో ఏపీఎస్ఆర్టీసీకి భారీ లాభాలు వచ్చాయి. గత సంక్రాంతి కంటే కూడా ఈ సంక్రాంతికి రద్దీ పెరిగిందని చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ.. అందుకు అనుగుణంగానే లాభాలు కూడా రెట్టింపుగా వచ్చాయని తెలిపింది.

సంక్రాంతి వేడుకలు ఏపీలో ఘనంగా జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఏపీకి భారీ ఎత్తున ప్రయాణాలు ఉంటున్నాయి. ఈ సారి కూడా అదే జోరు కొనసాగింది. ఈ సంక్రాంతికి ఏపీకి ఏకంగా 4.3 లక్షల మంది జనం వెళ్లారని అంచనా. వేడుకలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. తిరుగు ప్రయాణాలు కూడా పూర్తీ అయితే మొత్తంగా 8 లక్షల మంది దాకా ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించినట్టు అవుతుంది.

ప్రస్తుతానికి… ఏపీఎస్ఆర్టీసీకి ఈ ప్రయాణాల ద్వారా రూ.12 కోట్ల దాకా వాచినట్టు అధికారులు చెబుతున్నారు. తిరుగు ప్రయాణాలు కూడా పూర్తీ అయితే ఈ ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది సంక్రాంతికి మొత్తంగా 4.త్రీ కోట్ల మంది తమ బస్సుల్లో ప్రయాణించారని ఏపీఎస్ఆర్టీసీ చెప్పింది. ఈ లెక్కన  ఈ  సంక్రాంతికి ఏపీకి వెళ్లిన వారి సంఖ్యా దాదాపుగా డబల్ అయిపోయిందని చెప్పొచ్చు.