హిండెన్ బెర్గ్ చాప్టర్ క్లోజ్… కారణమేంటీ?

హిండెన్ బెర్గ్… ఈ పేరు వింటేనే పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు హడలిపోయాయి. అమెరికాకు చెందిన ఈ ఆన్లైన్ వార్త సంస్థ రాసిన కథనాలు ఆయా బహుళ జాతి సంస్థలకు ముచ్చెమటలు పట్టించాయి. ఇందులో భాగంగా… భారత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రపంచ అపర కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గౌతమ్ ఆదానీ ఆధ్వర్యంలోని ఆదానీ గ్రూప్ ను హిండెన్ బెర్గ్ వార్తలు బెంబేలెత్తించాయి. ఆదానీ గ్రూప్ ఏకంగా అక్రమాలకు పాల్పడుతోందంటూ హిండెన్ బెర్గ్ రాసిన వార్తలు యావత్తు ప్రపంచ వ్యాపారస్తులను భయపెట్టాయి.

ఇక సెబీ చీఫ్ మాధవి పూరి, ఆమె భర్త పైన బిందెను బెర్గ్ రాసిన కథనాలు భారత స్టాక్ మార్కెట్ ను షేక్  చేశాయని చెప్పాలి. ఈ వార్తల్లోనూ పెద్దగా నిజాలు లేవని ఆ తర్వాత దర్యాప్తులో తేలింది. మొత్తంగా సంచలనాలకు ప్రాధాన్యం ఇచ్చిన హిండెన్ బెర్గ్.. వాస్తవాలను రాయలేదన్న విషయం తేలిపోయిందన్న వాదనలు వినిపించాయి.

ఇలాంటి వార్తల నేపథ్యంలో గురువారం ఓ బాంబ్ లాంటి వార్త వినిపించింది. హిండెన్ బెర్గ్ తన కార్యకలాపాలన్నింటిని మూసివేస్తోందని ఓ సంచలన కథనం కనిపించింది. నేరుగా హిండెన్ బెర్గ్ చీఫ్ నాటే ఆండర్సన్ చెప్పినట్టుగా ఈ వార్తలు వచ్చాయి. ప్రత్యేకించి పెద్ద కారణమేమీ లేదని… తాము అనుకున్నది చేసి చూపించమని చెప్పిన ఆండర్సన్… ఆ పని ముగిసిపోయిందని, అందుకే తమ కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నామని వెల్లడించారు. ఓ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా రాణించిన డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కాస్తంత ముందుగా… హిండెన్ బెర్గ్ కు తాళం పడిపోతుండటం గమనార్హం.