స్టార్ బక్స్… దిగి రాక తప్పలేదా?

స్టార్ బక్స్… ఈ పేరు వింటేనే కుర్రకారుకి ఓ రేంజ్ ఉత్సాహం వస్తుంది. ఎప్పుడెప్పుడు అందులోకి ప్రవేశిద్దామా అంటూ కుర్రాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఇదంతా కాదండీ… స్టార్ బక్స్ పేరే ఓ బ్రాండ్. ఆ పేరు చెబితేనే రాజసం ఉట్టిపడుతుంది. ఇక అందులో దొరికే కాఫీ, స్నాక్స్ రుచి మధురమనే చెప్పాలి. అలాంటి స్టార్ బక్స్ కు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి దాపురించిందో తెలుసుకుంటేనే గుండె తరుక్కుపోతుంది.

స్టార్ బక్స్ బ్రాండ్ ఇమేజ్ కి తగ్గట్టే అతి చేసింది. తన కేఫ్ లకు వచ్చే కస్టమర్స్ పై దారుణంగా వ్యవహరించింది. కఠిన నిబంధనలు పెట్టింది. ఇంకేముంది… ఒక్కసారిగా కస్టమర్స్ రాక తగ్గిపోయింది. చాలా కేఫ్ లలో స్టాఫ్ ఈగలు తోలుకోక తప్పలేదు. ఆపై కోర్ట్ కేసులు సరే సరి. మొత్తంగా తన వైఖరి మారితేనే మనుగడ సాధ్యమని తెలుసుకుంది.

ఈ నెల 27 నుంచి స్టార్ బక్స్ తన నిబంధనలను మార్చనుంది. స్టార్ బక్స్ అద్ధ్వర్యంలోని కేఫ్ లకు వెళ్లేవారు ఎలాంటి కొనుగోళ్లు లేకుండానే… ఎంచక్కా స్టార్ బక్స్ లో ఆలా కాసేపు సేదతీరవచ్చు.

అంతేనా?.. స్టార్ బక్స్ కేఫ్ లలో ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండానే అక్కడి వైఫై ని వాడుకోవచ్చు. చివరకు… స్టార్ బక్స్ టాయిలెట్స్ ను కూడా వాడుకోవచ్చు. ఐతే.. దీనికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే… పే అండ్ యూస్ టాయిలెట్స్ మాదిరి అన్నమాట.