ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం కువైట్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అదేవిధంగా ఆయన మనసును హత్తుకునే సంఘటన కూడా జరిగింది. భారత పవిత్ర గ్రంధాలైన రామా యణ, మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించిన రచయిత.. అబ్దుల్లా అల్ బారౌన్, ఈ పుస్తకాల ను ప్రచురించిన పబ్లిషర్ అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్‌లతో ప్రధాని భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అరబిక్‌లో ఉన్న రామాయణ, మహాభారత పుస్తకాలను ఆసక్తిగా తిలకించారు. ఈ రెండు పుస్తకాలపైనా ప్రధాని మోడీ తన చేవ్రాలు చేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన ప్రధాని ఈ గ్రంథాలను అరబిక్‌లోకి అనువదించేందుకు ఎంత సమయం పట్టిందని ప్రధాని ప్రశ్నించారు. దీనికి సుమారు.. రెండు సంవత్సరాల ఎనిమిదిమాసాల సమయం పట్టినట్టు పబ్లిషర్ అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్ తెలిపారు.
“ప్రధాని మోడీని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకెంతో గౌరవం కూడా. ప్రధాని మోడీ కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. ఈ రెండు పుస్తకాలను చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్న ఆయన.. రెండు అరబిక్ గ్రంథాలపైనా సంతకాలు చేశారు.“అని అబ్దుల్లా లతీఫ్ అల్ నెసెఫ్ తెలిపారు.
కాగా.. దీనికి ముందే తన `మన్‌కీ బాత్` రేడియో కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీ య సంబంధాలను బలోపేతం చేసుకునే క్రమంలో సంస్కృతి, సంప్రదాయాల దౌత్యం కూడా.. అత్యంత కీలకమని నొక్కి చెప్పారు. కాగా, అబ్దుల్ లతీఫ్ అల్‌నెసెఫ్, అబ్దుల్లా బారౌన్‌లు.. ఇప్పటికి 30కి పైగా పుస్తకాలను అనువదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక గ్రంథాలపై వారు తమ దైన ముద్ర వేశారు.
అబ్దుల్ లతీఫ్ అల్‌నెసెఫ్.. కువైట్‌కు చెందిన ప్రముఖ పబ్లిషర్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల సంస్కృతులను ఆయన అధ్యయనం చేయడంతోపాటు.. పట్టు సాధించారు. రచయిత అబ్దుల్లా అల్ బరౌన్.. అద్భుతమైన అనువాదకుడిగా పేరు తెచ్చుకున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్‌కు వెళ్లిన ప్రధాని మోడీ.. అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కువైట్‌లోని భారత సంతతి పౌరులతోనూ.. ఆయన సంభాషించనున్నారు. కువైట్ రాజు.. షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా ఆహ్వానం మేరకు ప్రధాని కువైట్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నారు. గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
This post was last modified on December 22, 2024 8:00 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…