సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు క్రికెటర్లు తమకు దక్కిన రేటుతో సంతృప్తి చెందుతున్నారు. ఇక, మరికొందరు ఆటగాళ్లు గత వేలంలో పలికిన ధర కంటే తక్కువ ధరకు అమ్ముడుపోయి బాధపడుతున్నారు. ఈ కోవలో ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కేవలం11.75 కోట్లకు అమ్ముడుపోయాడు. గత వేలంలో 24.75 కోట్లు పలికిన స్టార్క్ ధర ఈసారి సగానికి సగం పడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. స్టార్క్ ని కేకేఆర్ రిటెయిన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేయగా ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
అదే తరహాలో వికెట్ కీపర్/ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ ధర కూడా గతంలో కంటే పడిపోయింది. గత వేలంలో 17 కోట్లు పలికిన రాహుల్ 14 కోట్లకే సరిపెట్టుకున్నాడు. పంత్ కు సమానంగగా కనీసం 18-20 కోట్లు పలుకుతాడనుకున్న రాహుల్ 14 కోట్లే పలకడంతో నిరాశ చెందాడు. లక్నో ఓనర్ తో గత సీజన్ సందర్భంగా జరిగిన గొడవ కారణంగా ఆ జట్టు నుంచి కేఎల్ బయలకు వచ్చాడు. దీంతో, ఆర్సీబీ కేఎల్ ను కొనుగోలు చేస్తుందని భావించినా..ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ జట్టు మాజీ కెప్టెన్ మార్క్ రమ్ ను కేవలం 2 కోట్ల బేస్ స్రైజ్ కు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
ఇక, ఈ వేలంలో బ్యాటింగ్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ జాక్ పాట్ కొట్టేశాడు. కేకేఈర్ అయ్యర్ ను 23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. చేసింది. చహల్ బేస్ ప్రైజ్ 2 కోట్లతో వేలంలోకి వచ్చిన అయ్యర్ ను కేకేఆర్ కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ వదులోకోవడంతో మెగా వేలంలోకి వచ్చిన టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ జాక్ పాట్ కొట్టేశాడు. రూ. 2 కోెట్ల కనీస ధరతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన చహల్ ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది.
చహల్ తరహాలోనే రాజస్థాన్ రాయల్స్ వదులుకున్న టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా మంచి ధరకే చెన్నైజట్టు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో దాదాపు ఇదే చివరి సీజన్ అని భావిస్తున్న అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.75 కోట్లకు దక్కించుకుంది. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో ఈ తరహాలో ఆటగాళ్ల ఓడలు బళ్లు..బళ్లు ఓడలు అయిన వైనం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.