సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది.
నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన నేపథ్యంలో SECI, రిలయన్స్ పవర్‌తో పాటు దాని అనుబంధ సంస్థలను మూడేళ్ల పాటు బిడ్డింగ్ ప్రక్రియల నుండి నిషేధించింది. దీనితో, భవిష్యత్తులో SECI నిర్వహించే ఏ బిడ్డింగ్‌లోనూ పాల్గొనేందుకు వీలుండదు.
జూన్‌లో SECI, 1 గిగావాట్ సోలార్ పవర్ అలాగే 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ ప్రాజెక్టులకు బిడ్లను ఆహ్వానించింది. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ NU BESS చివరి రౌండ్ బిడ్డింగ్‌లో పాల్గొంది.
అయితే, దర్యాప్తులో రిలయన్స్ NU BESS నకిలీ గ్యారెంటీలను సమర్పించినట్లు తేలడంతో SECI తక్షణమే చర్యలు తీసుకుని, బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. SECI ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల మిగతా బిడ్డర్లకు న్యాయం జరుగుతుందని చెబుతోంది.
ఇప్పటికే అనిల్ అంబానీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా భారీ నిషేధం విధించింది. ఆగస్టులో సెబీ అనిల్ అంబానీని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్ల పాటు నిషేధించింది. దీనికి కారణంగా నిధుల మళ్లింపు ఆరోపణలపై రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది.
సెబీ తీసుకున్న ఈ నిర్ణయంపై అనిల్ అంబానీ అప్పీల్ చేసినప్పటికీ, నిషేధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ రెండు అంశాలు అనిల్ అంబానీకి చెందిన సంస్థలు భవిష్యత్తులో మరింత కష్టాలను తీసుకురావచ్చు. రిలయన్స్ పవర్ లాంటి సంస్థపై ఈ నిషేధం విధించడం ఆ సంస్థ ద్రవీభవనను ప్రభావితం చేసే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో రిలయన్స్ గ్రూప్‌కు గడ్డు పరిస్థితులు తప్పవు.
Gulte Telugu Telugu Political and Movie News Updates