ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మ్యాచ్‌లు జరుగుతుండగా, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొన్నటి వరకు నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి ర్యాంక్ అందుకోవడానికి ఎంతో ధూరంలో లేడని అనుకుంటున్న టైమ్ లో ఊహించని షాక్ ఎదురయ్యింది. పూణే టెస్టులో న్యూజిలాండ్‌పై విఫలమైన జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి 3వ స్థానంలో నిలిచాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లతో రాణించిన దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 స్థానాన్ని సాధించాడు. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ జాష్ హేజిల్‌వుడ్ రెండవ స్థానంలో ఉన్నాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రెండో టెస్టులో 5 వికెట్లు తీసినా, 2వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకుకు పడిపోయాడు.
రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక రెండు ర్యాంకులు కోల్పోయి 8వ స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బౌలర్ నోమన్ అలీ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ప్రవేశించి, 9వ ర్యాంకులో నిలవడం గమనార్హం.
టాప్-10 టెస్ట్ బౌలర్ల లేటెస్ట్ ర్యాంకింగ్స్
- కగిసో రబాడ – 860 పాయింట్లు
- జాష్ హేజిల్‌వుడ్ – 847 పాయింట్లు
- జస్ప్రీత్ బుమ్రా – 846 పాయింట్లు
- రవిచంద్రన్ అశ్విన్ – 831 పాయింట్లు
- పాట్ కమ్మిన్స్ – 820 పాయింట్లు
- నాథన్ లియాన్ – 801 పాయింట్లు
- ప్రభాత్ జయసూర్య – 801 పాయింట్లు
- రవీంద్ర జడేజా – 776 పాయింట్లు
- నోమన్ అలీ – 759 పాయింట్లు
- మాట్ హెన్రీ – 743 పాయింట్లు