అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీకి మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్, ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తరఫున తన మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మస్క్ కూడా పాల్గొంటున్నారు. మరోవైపు, డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ కూడా ముమ్మర ప్రచారంలో ఉన్నారు.
ఇక ప్రపంచంలోని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ టెక్నాలజీ పరంగా ఎవరు సాధించలేని ఘనతను సాధించాడు. అతను తలచుకుంటే అమెరికా అధ్యక్షుడు కావచ్చు అని సోషల్ మీడియాలో కూడా తరచుగా వినిపించే మాట. అయితే ఎందుకు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదనే ప్రశ్నకు ఎలాన్ మస్క్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
మస్క్ తరచుగా ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు, కానీ ఈసారి న్యాయపరమైన, వ్యక్తిగత కారణాలను వివరించారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడాలనే ఉద్దేశం తనకు లేదని, తన జీవితంలో రాజకీయాలకు పెద్దగా ప్రాధాన్యం లేదని తెలిపారు. అలాగే మా గ్రాండ్ ఫాదర్ అమెరికాలో పుట్టినా, నేను దక్షిణాఫ్రికాలో జన్మించిన కారణంగా న్యాయపరంగా నేను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వలేనని తెలిపారు.
మస్క్ తన ఆసక్తిని సాంకేతిక రంగం, రాకెట్లు, మరియు ఇలక్ట్రిక్ కార్ల అభివృద్ధిపైనే కేంద్రీకరించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ‘సాంకేతికతను మెరుగుపరచడం, అంతరిక్ష ప్రయాణాలను సులభతరం చేయడం వంటి లక్ష్యాలపై నేను దృష్టి పెట్టాను. ప్రజలకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అందించడం నాకిష్టం’ అని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates