అమ్మో ..జగన్‌ కొడతాడేమో ?!

అమ్మో ..జగన్‌ కొడతాడేమో ?!

''శాసనసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చూస్తుంటే నన్ను కొడతారేమోనన్న భయం వేస్తుంది. నన్ను అన్యాయంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులవైపు కూర్చోబెట్టారు. ఆవేశంలో ఎప్పుడు ఎవరొచ్చి నన్ను కొడతారేమోనన్న భయంతో శాసనసభలో గడుపుతున్నాను. జగన్‌ మానసిక పరిస్థితి బాగున్నట్లు అనిపించడం లేదు. వెంటనే ఆయనకు సెలవు ఇచ్చి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించాలని కోరుతున్నాను'' అని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు అన్నారు. సభలో శాంతిభద్రతల మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో విష్ణు ఆరోపణలు సభ్యులలో నవ్వులు పూయించాయి.

జగన్‌ బఫూన్లు అని అన్న నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది. క్షమాపణకు జగన్‌ ససేమిరా అంటున్నారు. జగన్‌ అసెంబ్లీలో రౌడీలా వ్యవహరిస్తున్నాడని మంత్రి అచ్చెంనాయుడు విమర్శించారు. సభలో తాను ఎలా ప్రవర్తిస్తున్నది జగన్‌ ఓ సారి టీవీలో చూసుకోవాలని, జగన్‌ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి శాసనసభ ఇడుపులపాయ, పులివెందుల కాదని, సభ నియమావళి ప్రకారం జరుగుతుందని, దాని ప్రకారమే జగన్‌ నడుచుకోవాలని ఆయన సూచించారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు