పవన్ 'జగన్మాత' పంచ్ వెనుక ఇంత కథ వుందా?

పవన్ 'జగన్మాత' పంచ్ వెనుక ఇంత కథ వుందా?

రాజు రవితేజ అనే పేరు జనాలకు పరిచయం కావడానికి కారణం పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి రావాలని పవన్‌లో ఆలోచన మొదలైనపుడు ముందుగా ఈ రవితేజతోనే కలిసి పని చేశాడు. ఇద్దరూ కలిసి 'ఇజం' అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అంతకుముందు రవితేజ అనేవాడు ఒక అనామకుడు. పవన్‌తో కలిసి ప్రయాణించడం మొదలయ్యాక అతడికి పాపులారిటీ వచ్చింది.

క్రమంగా అతను కూడా ఒక సెలబ్రెటీ అయిపోయాడు. గతంలో ఒకసారి పవన్‌తో విభేదించి జనసేన పార్టీని వదిలి వెళ్లిపోయిన అతను.. మళ్లీ అనూహ్యంగా పార్టీలోకి వచ్చాడు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీలో కీలకంగానే వ్యవహరించాడు. కానీ ఇప్పుడు పవన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి పార్టీని వీడాడు. టీవీ చర్చల్లో పవన్ గురించి చాలా తీవ్రంగానే మాట్లాడుతున్నాడు.

ఐతే అటు వైపు నుంచి పవన్ మాత్రం రవితేజ గురించి ఒక్క విమర్శా చేయలేదు. అతడి రాజీనామాను ఆమోదిస్తున్నట్లుగా హుందాగా ఒక ప్రకటన ఇచ్చాడు. అందులో ఎక్కడా మాట తూలలేదు. కానీ ఈ ప్రెస్ నోట్లో ఒక్క పదంతోనే పవన్.. రవితేజకు ఇవ్వాల్సిన కౌంటర్ అంతా ఇచ్చేయడం విశేషం. రవితేజకు అంతా మంచే జరగాలని ఆ 'జగన్మాత'ను కోరుకుంటున్నట్లుగా పవన్ ఈ ప్రెస్ నోట్లో పేర్కొన్నాడు. ఇది పవన్ సొంత తెలివో.. లేదంటే ఎవరైనా సలహా ఇచ్చారో కానీ.. ఈ పదం వినియోగించడంలో చాలా అర్థమే ఉంది.

రాజు రవితేజ ఆధ్వర్యంలో క్రిస్టియన్ మిషనరీస్ నడుస్తున్నాయని.. ఆయనతో జగన్ పార్టీ వైకాపా నుంచి సంప్రదింపులు జరిపారని.. కొన్ని ప్రయోజనాలు చేకూర్చారని.. ఈ క్రమంలోనే పవన్‌ను తీవ్రంగా విమర్శించి పార్టీ నుంచి బయటికి వెళ్లాడని ఒక ప్రచారం జరుగుతోంది. రవితేజకు భాజపా అంటే అస్సలు నచ్చదని.. ఆ పార్టీతో పవన్ చేతులు కలపబోతున్నాడన్న సంకేతాలు కూడా రవితేజ బయటికి వెళ్లడానికి మరో కారణమని.. దీని వెనుక 'జగన్' ప్రమేయం ఉందన్న అనుమానాల నేపథ్యంలోనే 'జగన్మాత' అనే పదం వాడి రవితేజకు పవన్ పేలిపోే పంచ్ వేశాడని విశ్లేషకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English