కేసీఆర్‌కు చుక్క‌లు చూపిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ

కేసీఆర్‌కు చుక్క‌లు చూపిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ

`నా మాటే శాస‌నం..`ఇది ప్ర‌ముఖ సినిమాలోని పాపుల‌ర్ డైలాగ్ మాత్ర‌మే కాదు! తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోని ప‌రిస్థితి. పాల‌న‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి కూడా అనేది సుస్ప‌ష్టం. 40 రోజుల‌కు పైబ‌డి సాగుతున్న ఆర్టీసీ స‌మ్మె..దీనికి ఓ తార్కాణం. అంత‌టి శ‌క్తివంతుడైన గులాబీ ద‌ళప‌తి...త‌న పార్టీకి చెందిన ఎంపీపై చ‌ర్య తీసుకోలేక‌పోతున్నారు. అది కూడా...ప్రజాక్షేత్రంలో ఎంపీగా గెలిపొందిన వ్య‌క్తి కాదు. కేసీఆర్ ఇచ్చిన నామినేటెడ్ ప‌ద‌వి పొందిన ఎంపీ. త‌న చ‌ర్య‌ల‌తో అలా కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారింది మ‌రెవ‌రో కాదు...రాజ్య‌స‌భ స‌భ్యుడు ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు క‌విత నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓడిపోయింది డీఎస్ త‌న‌యుడు అర‌వింద్ చేతిలోనే. అయితే, ఆయ‌న‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ మాజీ ఎంపీ కవిత నేతృత్వంలో ఆ జిల్లా నేతలు గులాబీ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు.

డీఎస్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరారు. అయితే ఆ అంశంపై ఏ నిర్ణయం తీసుకోకుండా టీఆర్ఎస్‌ అధినేత పెండింగ్‌లో పెట్టారు. దీంతో డీఎస్ సైతం రిలాక్స్ అయ్యారు. అయితే, తాజాగా ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌కు డి.శ్రీనివాస్‌ లేఖ రాయడం ఆస‌క్తిక‌రంగా మారింది.  టీఆర్ఎస్ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారన్న చర్చ డీఎస్‌ వర్గీయుల్లో సాగుతోంది.

డీఎస్ ఈ లేఖాస్త్రం ద్వారా...సీనియర్ రాజకీయనేతగా ఆర్టీసీపై త‌న స్పంద‌న తెలియ‌జేయ‌డం మ‌రోవైపు...తానింకా ఆ పార్టీలోనే ఉన్నానని గుర్తుచేయ‌గ‌లిగారని అంటున్నారు. అదే స‌మ‌యంలో...ఆర్టీసీ సమ్మెపై స్పందిస్తే ఎక్కడ బాస్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనన్న భయంతో టీఆర్ఎస్ నేత‌లంతా సైలెంట్ అయిపోగా...ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయినా...ఆయ‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు లేవు. కార‌ణం చెప్ప‌కుండా....ఉప‌ముఖ్య‌మంత్రిని ప‌ద‌వి నుంచి ఊడ‌బీకేసే అంత స‌త్తా క‌లిగిన కేసీఆర్‌....ఈయ‌న్ను మాత్రం ముట్టుకోలేక‌పోవ‌డం...నిజంగా ఆశ్చ‌ర్య‌మే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English