తితిదే చిచ్చు.. జగన్‌పై వైసీపీ నేతల గుస్సా

తితిదే చిచ్చు.. జగన్‌పై వైసీపీ నేతల గుస్సా

ఏపీ సీఎం జగన్ ఏం చేసినా అది పార్టీలోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. రీసెంటుగా ఆయన ప్రభుత్వం చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ధర్మకర్తల మండలి కొత్త సభ్యుల నియామకం కూడా వివాదాస్పదమవుతోంది.  28 మందితో పాలక మండలిని ఏర్పాటు చేసినా అందులో ఏపీకి చెందినవారి సంఖ్య తక్కువగా ఉండడంతో ఏపీలోని వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

పాలకమండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు నలుగురు పోగా మిగతావారు 24 మంది. అందులో... ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కేవలం 8 మంది మాత్రమే. తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్నాటక నుంచి ముగ్గురికి, దిల్లీ నుంచి ఒకరికి.. మహారాష్ట్ర నుంచి ఒకరికి బోర్డులో స్థానం కల్పించారు. సాధారణంగా ఎక్స్ అఫీషియో సభ్యులు పోను మిగతా వాటిలో నాలుగైదు బయట రాష్ట్రాలవారికి ఇచ్చినా మిగతా స్థానాలను ఏపీకి చెందినవారికే ఇవ్వడం ఆనవాయితీ. కానీ, జగన్ మాత్రం ఏకంగా 16 మంది బయటవారిని నియమించడంతో తితితే పదవులు ఆశించిన వైసీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బోర్డులో కనీసం జిల్లాకు ఒకరికైనా స్థానం కల్పించాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

దేశంలోని ఏ ఆలయ పాలకమండలిలోనూ ఇంతపెద్ద సంఖ్యలో బయట రాష్ట్రాలవారు లేరని... తితిదే మాదిరిగానే దేశవ్యాప్త ఆదరణ ఉన్న ట్రావెన్‌కోర్ దేవాస్వం చూసుకున్నా ఇలా ఉండదని... జగన్ ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు.

బోర్డులో ఉన్నది వీరే..
1. కె.పార్థసారథి (ఎమ్మెల్యే)
2. యూవీ రమణమూర్తిరాజు (ఎమ్మెల్యే)
3. ఎం.మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే)
4. పరిగెల మురళీకృష్ణ
5. కృష్ణమూర్తి వైద్యనాథన్‌
6. నారాయణస్వామి శ్రీనివాసన్‌
7. జె.రామేశ్వరరావు
8. వి.ప్రశాంతి
9. బి.పార్థసారథిరెడ్డి
10. డాక్టర్‌ నిచిత ముప్పవరపు
11. నాదెండ్ల సుబ్బారావు
12. డీ.పీ.అనంత
13.రాజేష్‌ శర్మ
14. రమేష్‌ శెట్టి
15. గుండవరం వెంకట భాస్కరరావు
16. మూరంశెట్టి రాములు
17. డి.దామోదర్‌రావు
18. చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌
19. ఎంఎస్‌ శివశంకరన్‌
20. సంపత్‌ రవి నారాయణ
21. సుధా నారాయణమూర్తి
22. కుమారగురు (ఎమ్మెల్యే)
23. పుట్టా ప్రతాప్‌రెడ్డి
24. కె.శివకుమార్‌

ఎక్స్అఫీషియో సభ్యులు :
1. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్‌)
2. దేవాదాయ శాఖ కమిషనర్‌
3. తుడా ఛైర్మన్‌
4. టీటీడీ ఈవో

వీరిలో ఏపీ నుంచి ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, గొల్ల బాబూరావు, నాదెండ్ల సుబ్బారావు, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాదకుమార్, కె.పార్థసారథి మాత్రమే ఏపీకి చెందినవారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English