ఔరా మ‌లింగ‌.. మ‌ళ్లీ 4 బంతుల్లో 4 వికెట్లు

ఔరా మ‌లింగ‌.. మ‌ళ్లీ 4 బంతుల్లో 4 వికెట్లు

శ్రీలంక మిస్ట‌రీ ఫాస్ట్ బౌల‌ర్ ల‌సిత్ మ‌లింగ మ‌రోసారి అంత‌ర్జాతీయ క్రికెట్లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అత‌ను శుక్ర‌వారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో వ‌రుస‌గా 4 బంతుల్లో 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్లో మూడో బంతి నుంచి మ‌లింగ వ‌రుస‌గా కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్‌ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్‌హో‌మ్ (0), రాస్ టేలర్ (0)లను ఔట్ చేశాడు. ఇందులో ఇద్ద‌రు క్లీన్ బౌల్డ్ కాగా.. ఇంకో ఇద్ద‌రు ఎల్బీడ‌బ్ల్యూ అయ్యారు.

ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అనంతరం మలింగ దెబ్బకు విలవిల‌లాడిన న్యూజిలాండ్ 16 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మ‌లింగ 4 ఓవ‌ర్ల‌లో 6 ప‌రుగులే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో  టీ20ల్లో వంద వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గా అత‌ను రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌ మ‌లింగ‌నే.

అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న రెండుసార్లు చేసిన తొలి బౌలర్‌గా మ‌లింగ‌ రికార్డు సృష్టించాడు. అత‌ను వ‌న్డేల్లోనూ ఈ ఘ‌న‌త సాధించాడు. 2007 ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా ద‌క్షిణాఫ్రికాపై అత‌ను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక‌కు సంచ‌ల‌న విజ‌యాన్నందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English