స‌ర్పంచ్‌కు ఉన్న సోయి కూడా కేసీఆర్‌కు లేదు

స‌ర్పంచ్‌కు ఉన్న సోయి కూడా కేసీఆర్‌కు లేదు

సుదీర్ఘ‌కాలం త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల‌తో పాటుగా కీల‌క‌మైన అంశాల‌పై ఆయ‌న తీవ్రంగా స్పందించారు. ఎమ్మార్పీఎస్ కేంద్ర కార్యాలయంలో మంద కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ జయంతి ఉత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవటం అంబేద్కర్ ను అవమానించటమేనన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్నా.. కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ కు ఉన్న సోయి కేసీఆర్ కు ఎందుకు లేదని ప్రశ్నించారు. కేసీఆర్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మహా ధర్నాలు, నిరసన దీక్షలు  చేస్తామన్నారు.

అంబేద్కర్ విగ్రహం విరగగొట్టి చెత్త వ్యాన్ లో తీసుకువెళ్లి డంప్ యార్డ్ లో  పడవేయడం దారుణమని మంద‌కృష్ణ అన్నారు. ఈ ఘటనపై కనీసం ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదన్నారు. రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పర్మిషన్ లేని విగ్రహాలు ఎన్నో ఉన్నాయన్న మందకృష్ణ మాదిగ…అంబేద్కర్ విగ్రహం తొలగిస్తే..పక్కనే ఉన్న YS రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కూడా పర్మిషన్ లేదని, ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదన్నారు. అంబేద్కర్ కు ఇంత అవమానం జరిగిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీలకు  గౌరవం ఎక్కడ ఉందని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

అగ్రకుల అహంకారంతోనే అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో కేసీఆర్ పాల్గొనలేదని మంద‌కృష్ణ మాదిగ ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి పాదాభివందనం చేసే కేసీఆర్ ప్ర‌స్తుత‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్ దళితుడు కాబట్టి ఎప్పుడు పాదాభివందనం చేయలేదని మంద‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని పునఃప్ర‌తిష్టించాల‌ని డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English