సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొందరు ఏకంగా ఈ సినిమా హార్డ్ డిస్క్ పోయిందని, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు పెట్టడం వాళ్లలో ఉన్న అసహనాన్ని బయట పెడుతోంది. కంగువ కోసం ఏళ్ళ తరబడి కష్టాన్ని బూడిదపాలు చేసుకున్న సూర్యకు కరుప్పు పెద్ద బ్రేక్ అవుతుందని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. లాయర్, దేవుడిగా రెండు సంబంధం లేని పాత్రలు చేస్తున్న సూర్య దీని క్లైమాక్స్ లో కాంతార రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని ఇప్పటికీ టీమ్ నుంచి వచ్చిన లీకులు అంచనాలు పెంచుతున్నాయి.

ఆర్జె బాలాజీ దర్శకత్వంలో రూపొందిన కరుప్పుకి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ఓటిటి డీల్స్ వల్ల జరిగిన ఆలస్యం పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చింది. ఇంకో వైపు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో లేట్ గా మొదలైన సూర్య 46 ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. వేసవి రిలీజ్ కు సితార సంస్థ ప్లానింగ్ లో ఉంది. కరుప్పు సంక్రాంతికి రాలేదు. ఎందుకంటే జన నాయకుడు, పరాశక్తితో పాటు తెలుగులో ఇంకో అయిదు సినిమాలు పోటీలో ఉన్నాయి. జనవరి చివరికి వెళదామంటే కమర్షియల్ గా ఎంతమేరకు వర్కౌట్ అవుతుందనే దాని మీద అనుమానాలు ఉన్నాయట. ఫిబ్రవరి డ్రై సీజన్ కాబట్టి థియేటర్ రన్ ఎక్కువ రాదనే డౌట్ కావొచ్చు.

వీలైనంత త్వరగా కరుప్పు డైలమాకు చెక్ పెట్టాలి. తక్కువ గ్యాప్ లో రెండు సినిమాలు రావడం కూడా అంత సేఫ్ కాదు. ఇలా అయితే కరుప్పు మీద మెల్లగా బజ్ తగ్గిపోతుందని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఆర్జె బాలాజీ మాత్రం బయట ఎవరు అడిగినా సినిమా అదిరిపోతుందని చెబుతున్నాడు తప్పించి స్పష్టమైన అప్డేట్ ఇవ్వడం లేదు. కంగువ అంటే ప్యాన్ ఇండియా బడ్జెట్ కాబట్టి ఆలస్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కరుప్పు లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ కు ఇలా జరగడం హర్షించదగినది కాదు. అయినా సూర్య బంధువులే నడిపించే డ్రీం వారియర్ బ్యానర్ మూవీకి సైతం ఓటిటి చిక్కులంటే ఆలోచించాల్సిన విషయమే.