బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా, సోమవారం ఏదైతే జరగకూడదని ట్రేడ్ వర్గాలు టెన్షన్ పడ్డాయో అదే జరిగింది. నిన్న ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరు కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైనట్టు వచ్చిన వార్త ఆందోళన రేపుతోంది. నైజామ్, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో కొంతమేర పర్వాలేదనిపిస్తున్నప్పటికీ తెలంగాణ బిసి సెంటర్లతో పాటు ఏపీ ఆంధ్రా వైపు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. టాక్ కు అనుగుణంగా టికెట్ రేట్లను చాలా చోట్ల సవరించకపోవడంతో థియేటర్లు నిండటం లేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఈ పరిణామాలు డేంజర్ బెల్స్ లాంటివే.
ఇప్పటిదాకా వచ్చిన గ్రాస్ సుమారు తొంభై కోట్ల దాకా ఉండొచ్చని రిపోర్ట్. అంటే రికవరీ యాభై శాతమే అయ్యింది. ఇంకా సగం పైనే దూరంలో బ్రేక్ ఈవెన్ ఉంది. మిక్స్డ్ టాక్ ప్రభావం గట్టిగానే పడింది. దురదృష్టవశాత్తు నిర్మాతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఉత్తరాదిలో అఖండ 2 క్రాష్ అయ్యింది. బోయపాటి మార్క్ ఓవర్ ఎలివేషన్లు అక్కడి ఆడియన్స్ కి అలవాటు లేకపోవడంతో కంటెంట్ కనెక్ట్ కావడం లేదని హిందీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకటి రెండు ఎపిసోడ్లు బాగున్నప్పటికీ ఓవరాల్ గా పబ్లిక్ టాక్ యునానిమస్ గా రాకపోవడం కలెక్షన్లను మరీ తీసికట్టుగా మార్చింది. ప్రమోషన్లు పెద్దగా పనిచేయనట్టే.
గత వారం విడుదలైన దురంధర్ ఎఫెక్ట్ అఖండ 2 మీద పడింది. టాక్ మెల్లగా పాకిపోవడంతో ప్రేక్షకులు దాని థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఇక మన విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడీ వేగంతో అఖండ 2 గట్టెక్కడం కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. శుక్రవారం రిలీజుల్లో పెద్దగా చెప్పుకునేవి లేవు కాబట్టి రెండో వీకెండ్ ఏమైనా పుంజుకుంటే రెవిన్యూలో పెరుగుదల చూడొచ్చు. సక్సెస్ మీట్ హైదరాబాద్ లో చేశారు కానీ ఏపీ సైడ్ ఇంకోటేదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. కెజిఎఫ్ 2, పుష్ప 2 రేంజ్ లో రెస్పాన్స్ ఊహించుకున్న ఫ్యాన్స్ కి అది నెరవేరకపోవడం నిరాశ కలిగిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates