ప్ర‌ధాని హోదాలో మోడీ 7కి.మీ. న‌డ‌క ఎందుకు?

ప్ర‌ధాని హోదాలో మోడీ 7కి.మీ. న‌డ‌క ఎందుకు?

మాజీ ప్ర‌ధాని వాజ్ పేయ్ అంతిమ యాత్ర సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఒక ఉదంతం రాజ‌కీయ వ‌ర్గాల్లో విప‌రీత‌మైన ఆస‌క్తిని వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది వాజ్ పేయ్ పార్థివ వాహ‌నం వెనుక ల‌క్ష‌లాది మంది కదిలి వ‌స్తుండ‌గా.. వారితో పాటు ఒక వ్య‌క్తి విషాదంతో అడుగులో అడుగు వేసుకుంటూ న‌డిచిన వైనం అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఇప్పుడా అంశం హాట్ టాపిక్ అయ్యింది.

వాజ్ పేయి అంతిమ‌యాత్ర‌లో ప్ర‌ధాని హోదాలో ఉన్న న‌రేంద్ర మోడీ దాదాపు ఏడు కిలోమీట‌ర్ల మేర న‌డిచి నివాళులు అర్పించటం చరిత్ర‌లో ఇదే తొలిసారిగా అభివ‌ర్ణిస్తున్నారు. ప్ర‌ధాని మోడీతో పాటు.. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా.. ఆయ‌న మంత్రి వ‌ర్గం మొత్తం ఆయ‌న వాహ‌నాన్ని అనుస‌రించింది.

మోడీ లాంటి వ్య‌క్తే వాహ‌నం వెనుక న‌డిచిన వేళ‌లో.. వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్య‌మంత్రులు సైతం న‌డిచారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు విజ‌య్ రూపానీ.. శివ‌రాజ్ చౌహాన్.. యోగి అదిత్య‌నాథ్‌.. ప‌డ్న‌వీస్ త‌దిత‌రులు ఏడు కిలోమీట‌ర్ల మేర న‌డిచారు. వాజ్ పేయి ఆరోగ్యం విష‌మించింద‌న‌న స‌మాచారం అందిన‌24 గంట‌ల్లో రెండుసార్లు ఆసుప‌త్రికి వెళ్లిన మోడీ.. వాజ్ పేయి మీద త‌న‌కున్న అభిమానాన్ని.. గౌర‌వాన్ని చాటుకున్నారు.

వాజ్ పేయి మ‌ర‌ణ‌వార్త తెలిసిన వెంట‌నే అత్య‌వ‌స‌రంగా కేబినెట్ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి సంతాప తీర్మానం చేయ‌టంతో పాటు.. వాజ్ పేయి అధికార నివాసంలోనూ.. బీజేపీ కార్యాల‌యంలోనూ పార్థిప దేహం వెంటే ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే.. దీనిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అద్వానీ విష‌యంలో మోడీ వ్య‌వ‌హార‌శైలిపై వ‌చ్చిన ప్ర‌తికూల ఇమేజ్ ను వాజ్ పేయి ఎపిసోడ్ ద్వారా పాజిటివ్ చేసుకున్న వాద‌న వినిపిస్తోంది.

బీజేపీకి మూల‌స్థంభం లాంటి అద్వానీపై మోడీకి ఎలాంటి గౌర‌వం లేద‌ని.. అందుకు ఆయ‌న తీరును ప్ర‌స్తావించే వారు.. వేలెత్తి చూపించే వారు. ఇక‌పై అలాంటి అవ‌కాశం లేకుండా చేసేందుకు మోడీ ముందుచూపుతో ఏడు కిలోమీట‌ర్ల దూరాన్ని న‌డిచార‌న్న మాట వినిపిస్తోంది.

అయితే..ఈ త‌ర‌హా వాద‌న స‌రికాద‌ని.. వాజ్ పేయి మీద ఉన్నగౌర‌వంతోనే మోడీ న‌డిచి ఉంటార‌న్న అభిప్రాయాన్ని మ‌రికొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఏమైనా.. అద్వానీ న‌మ‌స్కారం పెడుతున్న ప‌ట్ట‌న‌ట్లుగా ముందుకు వెళ్లిన మోడీ.. ప్ర‌జాజీవ‌నానికి ఏళ్ల త‌ర‌బ‌డి దూరంగా ఉన్న ఒక‌నాటి త‌న గురువుకు మాత్రం భిన్నమైన అంతిమ నివాళి ఇవ్వ‌టం వెనుక విష‌యం రానున్న రోజుల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించే తీరు స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు